AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs New Zealand: ఐదేళ్ల తర్వాత ఆతిథ్యం ఇవ్వనున్న గ్రీన్ పార్క్ స్టేడియం.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు..!

Kanpur Green Park Stadium: నవంబర్ 25 నుంచి 29 వరకు జరిగే టెస్టు మ్యాచ్ కోసం యూపీసీఏ స్టేడియం సిద్ధమవుతోంది. దీనికోసం రూ.15 లక్షలను క్రీడా శాఖకు చెల్లించనున్నట్లు సమాచారం.

India Vs New Zealand: ఐదేళ్ల తర్వాత ఆతిథ్యం ఇవ్వనున్న గ్రీన్ పార్క్ స్టేడియం.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు..!
India Vs New Zealand, Kanpur Green Park Stadium
Venkata Chari
|

Updated on: Nov 12, 2021 | 10:55 AM

Share

India Vs New Zealand: నవంబర్ 24న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ఐదేళ్ల తర్వాత జరగనున్న మ్యాచ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించే అవకావం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక అనుమతి రాలేదు. కానీ, UPCAతోపాటు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో ప్రేక్షకుల గ్యాలరీని కూడా ఆయన ప్రారంభించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం బీసీసీఐ, యూపీసీఏ, జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించాయి. రాష్ట్రపతిని ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రం సిద్ధమవుతోంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 24, 25 తేదీల్లో కాన్పూర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన కాన్పూర్ పర్యటనలో మెహెర్బాన్ సింగ్ పూర్వా, HBTUని సందర్శిస్తారు. సమాచారం ప్రకారం రాష్ట్రపతి నవంబర్ 25న ప్రేక్షకుల గ్యాలరీని, ఇండియా-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌ను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం జిల్లా, క్రికెట్ బోర్డు అధికారులు అధ్యక్షుడిని పిలిచేందుకు ఆహ్వాన పత్రికను సిద్ధం చేస్తున్నారని, దీనిపై నవంబర్ 15న తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అద్దె రూ.15 లక్షలు.. నవంబర్ 25 నుంచి 29 వరకు జరిగే టెస్టు మ్యాచ్ కోసం యూపీసీఏ స్టేడియం అద్దె రూ.15 లక్షలను క్రీడా శాఖకు చెల్లించనున్నట్లు సమాచారం. అంటే ఒకరోజు ఫీజు రూ.3 లక్షలన్నమాట.

నాలుగు ఫ్లడ్‌లైట్లు సిద్ధం.. కాన్పూర్‌లో జరగనున్న మ్యాచ్ కోసం స్టేడియంలో మొత్తం నాలుగు ఫ్లడ్‌లైట్లను పరీక్షించారు. ఈ లైట్లు బుధవారం చాలా సేపు వెలుగుతుండటంతో వాటిని పరీక్షించారు. లైట్లు బాగానే ఉన్నాయని యూపీసీఏ నోడల్ అధికారి అనిల్ కంసే తెలిపారు. గ్రీన్‌పార్క్‌లో నూతనంగా నిర్మించిన విజిటర్‌ ప్లేయర్స్‌ పెవిలియన్‌లో మురుగు కాల్వలు నిండిపోయాయి. దీంతో బేస్‌మెంట్‌ గోడల నుంచి నీరు కారడంతోపాటు గోడలు ధ్వంసమవుతున్నాయి. అయితే నీటి లీకేజీని అడ్డుకునేందుకు గోడలపై మార్బుల్స్ లేదా ఫ్లోరింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే విజిటర్ ప్లేయర్స్ పెవిలియన్‌లో నిర్మించిన రిఫరీ గదిని భారీ స్థాయిలో పెంచనున్నారు. ఇప్పటివరకు ఇది చాలా చిన్నదిగా ఉండడంతోపాటు కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సీటింగ్ ఉంది. ప్రస్తుతం దాని సామర్థ్యాన్ని పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read: PAK vs AUS: ఐసీయూలో 2 రోజులు.. దేశం కోసం సెమీఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్.. మ్యాచ్ ఓడినా ప్రజల హృదయాలను గెలిచిన పాక్ ప్లేయర్..!

Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!