PAK vs AUS: ఐసీయూలో 2 రోజులు.. దేశం కోసం సెమీఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్.. మ్యాచ్ ఓడినా ప్రజల హృదయాలను గెలిచిన పాక్ ప్లేయర్..!

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులతోపాటు అనుభవజ్ఞులను ఆకట్టుకున్నాడు.

PAK vs AUS: ఐసీయూలో 2 రోజులు.. దేశం కోసం సెమీఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్.. మ్యాచ్ ఓడినా ప్రజల హృదయాలను గెలిచిన పాక్ ప్లేయర్..!
Mohammad Rizwan, Pakistan Vs Australia
Follow us

|

Updated on: Nov 12, 2021 | 10:49 AM

T20 World Cup 2021, Pakistan Vs Australia: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులతోపాటు అనుభవజ్ఞులను ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో, అతను మరోసారి హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో పాకిస్థాన్ 176 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గాయపడినప్పటికీ రిజ్వాన్ క్రీజులో కొనసాగాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ ఈ బ్యాట్స్‌మెన్‌ను ప్రశంసించాడు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి వరకు రిజ్వాన్ ఆసుపత్రిలో ఉన్నాడు.

గురువారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. అతను మొదట బాబర్ అజామ్‌, తరువాత ఫక్మ్ జమాన్‌తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడిని చూడగానే ముందురోజు రాత్రి ఆసుపత్రిలో ఉన్నాడని ఊహించడం చాలా కష్టం.

మ్యాచ్‌కు ముందు ఆసుపత్రిలో రిజ్వాన్.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, రిజ్వాన్‌కు బ్రోన్కైటిస్ (ఊపిరితిత్తుల సమస్య) సమస్య ఉందని తేలింది. దాని కారణంగా అతను ఒక రాత్రి ఆసుపత్రిలో ఉన్నాుడని మాథ్యూ హేడెన్ తెలిపాడు. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌‌కు ముందు హేడెన్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌కు ఒక రోజు ముందు వరకు రిజ్వాన్ ఆసుపత్రిలో ఉన్నాడు. ఆరోగ్యం బాగోలేకపోయిన జట్టును ఫైనల్ చేర్చాలని బరిలోకి దిగాడు’ అని పేర్కొన్నాడు. బాబర్‌తో అతని భాగస్వామ్యం కూడా అద్భుతమైనది.

రిజ్వాన్ మైదానంలో పాకిస్తాన్ కోసం ఒక మ్యాచ్ ఆడటానికి ఆసుపత్రి నుంచి కోలుకుని బయటకు రావడమే కాకుండా, ఆస్ట్రేలియాతో ఆడిన రెండవ సెమీ-ఫైనల్‌లో పాక్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను అన్ ఫిట్ అయిన తర్వాత కూడా 87 నిమిషాలపాటు బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో రిజ్వాన్ 52 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేశాడు. రిజ్వాన్ ఈ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

రిజ్వాన్ ధైర్యంపై సర్వత్రా చర్చ.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నిస్సందేహంగా ఓడిపోయింది. కానీ, తన బోల్డ్ ఇన్నింగ్స్ కారణంగా రిజ్వాన్ ప్రపంచ హృదయాలను గెలుచుకోగలిగాడు. రిజ్వాన్ చూపిన ఇలాంటి తెగువపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రిజ్వాన్ చెప్పిన మాటలు నమ్మడం కష్టమని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

టీ20లో ‘సిక్సర్ కింగ్’ మహ్మద్ రిజ్వాన్.. ఆస్ట్రేలియాపై మొహమ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత కూడా పాకిస్తాన్ గెలవలేదు. కానీ, అతని ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు కొట్టడం ద్వారా, రిజ్వాన్ ఖచ్చితంగా టీ20 ఇంటర్నేషనల్‌లో ఈ సంవత్సరం సిక్సర్ కింగ్‌గా నిలిచాడు. వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్‌తో కలిసి ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇద్దరి పేర్లతో 37 అంతర్జాతీయ సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ 31 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. 2015 వరకు పాకిస్థాన్ తరఫున 1 టీ20 మాత్రమే ఆడిన రిజ్వాన్ 6 ఏళ్ల తర్వాత సగటు పరంగా విరాట్ కోహ్లీతో పోటీ పడుతున్నాడు. టీ20ల్లో ఎంతటి సమర్థుడో ఈ గణంకాలే చూపిస్తున్నాయి.

Also Read: Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!

T20 World Cup 2021: ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ దెబ్బ.. సెమీ-ఫైనల్‌ సూపర్ హీరో ఔట్.. భారత సిరీస్‌కు డౌటే..!