AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021, AUS vs NZ: వావ్.. రెండు సెమీ ఫైనల్స్ ఫలితాలు ఒకేలా.. మిరాకిల్ అంటోన్న నిపుణులు..!

New Zealand vs Australia: 2 సెమీ-ఫైనల్ విజేతలు ఫైనల్ పోరుకు సిద్ధమయయ్యాయి. విశేషమేమిటంటే.. రెండు సెమీ ఫైనల్స్ ఫలితాలు ఒకే విధంగా ఉండడం.

T20 World Cup 2021, AUS vs NZ: వావ్.. రెండు సెమీ ఫైనల్స్ ఫలితాలు ఒకేలా.. మిరాకిల్ అంటోన్న నిపుణులు..!
T20 World Cup 2021 Final Aus Vs Nz
Venkata Chari
|

Updated on: Nov 12, 2021 | 1:08 PM

Share

New Zealand vs Australia: టీ20 ప్రపంచ కప్ 2021 ఫైనల్ లైనప్ సిద్ధంగా ఉంది. నవంబర్ 14న దుబాయ్ మైదానంలో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 24 గంటల్లో 2 సెమీ-ఫైనల్ విజేతలు ఫైనల్ పోరుకు సిద్ధమయయ్యాయి. విశేషమేమిటంటే.. రెండు సెమీ ఫైనల్స్ ఫలితాలు ఒకే విధంగా ఉండడం. రెండు మ్యాచ్‌లు రెండు నగరాల్లో జరిగినా.. అందులో చాలా యాదృచ్ఛికాలు కనిపించాయి. ఈ టోర్నీలో తొలి సెమీఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య అబుదాబిలో జరగగా, రెండో సెమీఫైనల్ పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా టీంల మధ్య దుబాయ్‌లో జరిగింది.

టీ20 ప్రపంచ కప్ 2021 రెండు సెమీ-ఫైనల్‌లలో ఓటమితోపాటు విజయాల మార్జిన్ ఒకే విధంగా ఉండడం విశేషం. రెండు మ్యాచ్‌ల్లో జట్లు 5 వికెట్ల తేడాతో గెలుపొందాయి. తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ ఒక ఓవర్ ముందుగా లక్ష్యాన్ని ఛేదిస్తే.. రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా కూడా పాకిస్థాన్‌పై ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. టోర్నీలో రెండు సెమీ ఫైనల్స్‌లోనూ జట్లు గెలవాలంటే చివరి 5 ఓవర్లలో 60 ప్లస్ పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రెండూ ఒక ఓవర్ ముందుగానే లక్ష్యాన్ని సాధించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చివరి రెండు ఓవర్లలో ఇరు జట్లకు 22 అవసరమయ్యాయి. కానీ, 1 ఓవర్‌ మిగిలుండగానే టార్గెట్‌ను చేరుకుని ఆశ్చర్యపరిచాయి.

టాస్ గెలిచిన జట్లదే విజయం.. టోర్నమెంట్‌లో భాగంగా మొదటి సెమీ-ఫైనల్ నవంబర్ 10న సాయంత్రం న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత ఆడుతున్న ఇంగ్లండ్‌ టీం న్యూజిలాండ్‌ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా, 19వ ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అదే సమయంలో రెండవ సెమీ-ఫైనల్ నవంబర్ 11 సాయంత్రం పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది.

ఈసారి టీ20 ప్రపంచకప్‌లో కొత్త ఛాంపియన్‌.. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ల మధ్య ఫైనల్‌ జరుగుతుందని క్రికెట్‌ పండితులు అంచనా వేశారు. కానీ, టోర్నీ నుంచి ఇరు జట్లు నిష్క్రమించడంతో అందరి అంచనాలు తప్పాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇరు జట్లు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్ గెలిస్తే, ఒకే ఏడాదిలో 2 ఐసీసీ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా అవతరిస్తుంది.

Also Read: India vs New Zealand: కివీస్‌తో టెస్టుల్లో తలపడే టీమిండియా స్వ్కాడ్ ఇదే.. స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి.. కెప్టెన్‌గా ఎవరంటే?

India Vs New Zealand: ఐదేళ్ల తర్వాత ఆతిథ్యం ఇవ్వనున్న గ్రీన్ పార్క్ స్టేడియం.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు..!