AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: కోహ్లీ రికార్డుకు ఎసరు పెట్టనున్న వార్నర్.. విఫలమైన బాబర్.. టీ20 ప్రపంచకప్‌లో వీరే టాప్?

Virat Kohli: పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువయ్యాడు.

T20 World Cup 2021: కోహ్లీ రికార్డుకు ఎసరు పెట్టనున్న వార్నర్.. విఫలమైన బాబర్.. టీ20 ప్రపంచకప్‌లో వీరే టాప్?
T20 World Cup 2021 Virat, Warner, Babar
Venkata Chari
|

Updated on: Nov 12, 2021 | 1:22 PM

Share

David Warner: విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టేందుకు బాబర్ ఆజం చాలా దగ్గరగా వచ్చాడు. కానీ, సెమీఫైనల్లో పాకిస్థాన్‌ ఓటమి తర్వాత విరాట్‌ రికార్డును బద్దలు కొట్టలేడని తేలిపోయింది. అయితే పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ మాత్రం విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసేందుకు చేరువయ్యాడు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరుతోనే నిలిచింది. 2014 ప్రపంచకప్‌లో 319 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ.. ఓ ప్రపంచకప్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన లిస్టులో తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 2009లో శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ 317 పరుగులతో ఓ దశలో విరాట్ రికార్డును బ్రేక్ చేసేందుకు దగ్గరయ్యాడు. కానీ రెండు పరుగుల దూరంలో నిలిచి రెండో స్థానంలో నిలిచాడు. ఇక 6 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్.. విరాట్ రికార్డును చెరిపేసేందుకు సిద్ధమైనట్లే కనిపించాడు. కానీ, సెమీఫైనల్‌లో పాక్‌ జట్టు ఓటమితో ఈ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

Babar Ajam

టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టగల ఏకైక బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. అయితే, దీని కోసం అతను ఫైనల్లో 84 పరుగులు చేయాల్సి ఉంటుంది. డేవిడ్ వార్నర్ ప్రస్తుతం 6 మ్యాచ్‌ల్లో 234 పరుగులు చేశాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

టీ20 ప్రపంచ కప్ 2021లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో సెమీ-ఫైనల్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఓపెనర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పాక్ కెప్టెన్‌ బాబర్ అజామ్ 303 పరుగులతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. మహ్మద్ రిజ్వాన్ 281 ​​పరుగులతో రెండో స్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ 6 మ్యాచ్‌ల్లో 269 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 6 మ్యాచ్‌ల్లో 236 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, శ్రీలంకకు చెందిన అసలంక 6 మ్యాచ్‌ల్లో 231 పరుగులతో 5వ స్థానంలో నిలిచాడు.

Also Read: T20 World Cup 2021, AUS vs NZ: వావ్.. రెండు సెమీ ఫైనల్స్ ఫలితాలు ఒకేలా.. మిరాకిల్ అంటోన్న నిపుణులు..!

Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!

ప్రియురాలిని చంపి సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు.!
ప్రియురాలిని చంపి సంచిలో ప్యాక్ చేసిన ప్రియుడు.!
ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
ఇస్రో ఖాతాలో మరో ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
చిన్న గింజల్లో దివ్యౌషధం.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.
చిన్న గింజల్లో దివ్యౌషధం.. ఈ 7 ప్రయోజనాలు తెలిస్తే.
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
'కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు' మీకో దండం
వదినను హత్య చేసిన మరిది.. ఎందుకో తెలుసా..?
వదినను హత్య చేసిన మరిది.. ఎందుకో తెలుసా..?
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు
ఓరీ దేవుడో.. ఈ బిర్యానీ తిన్నారంటే బతుకు బండి కూలినట్టే..!
ఓరీ దేవుడో.. ఈ బిర్యానీ తిన్నారంటే బతుకు బండి కూలినట్టే..!
వందే భారత్ ప్రయాణికులకు మరో శుభవార్త.. మరో ట్రైన్ కూడా వచ్చేసింది
వందే భారత్ ప్రయాణికులకు మరో శుభవార్త.. మరో ట్రైన్ కూడా వచ్చేసింది
అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్
అంతడబ్బు అక్కడెలా దాచావ్‌‌ రా.. పోలీసులే నోరెళ్లబెట్టిన సీన్
నేటి తరం హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా 92 ఏళ్ల సీనియర్​ నటి ఫిట్‌నెస్
నేటి తరం హీరోయిన్లకు షాక్ ఇచ్చేలా 92 ఏళ్ల సీనియర్​ నటి ఫిట్‌నెస్