AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 1st Test: టాస్ గెలిచిన రోహిత్.. ప్లేయింగ్‌లో రెండు మార్పులు.. దూరమైన ఫ్యూచర్ స్టార్

India vs New Zealand, 1st Test: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఎట్టకేలకు రెండో రోజు టాస్ పడింది. తొలిరోజు వర్షంతో టాస్ కూడా పడలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, రోహిత్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగనున్నాడు. గిల్ గాయంతో దూరమవ్వగా, సర్ఫరాజ్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అలాగే, కుల్దీప్ కూడా తొలి టెస్ట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

IND vs NZ 1st Test: టాస్ గెలిచిన రోహిత్.. ప్లేయింగ్‌లో రెండు మార్పులు.. దూరమైన ఫ్యూచర్ స్టార్
Ind Vs Nz 1st Test
Venkata Chari
|

Updated on: Oct 17, 2024 | 9:09 AM

Share

India vs New Zealand, 1st Test: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ సిరీస్ బెంగళూరు వేదికగా జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో వర్షాలు పడకపోయినా ఆకాశం మేఘావృతమై ఉంది. గురువారం ఇక్కడ 40% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయిన సంగతి తెలిసిందే.

వాతావరణ వెబ్‌సైట్ Accuweather ప్రకారం, బెంగళూరులో రాబోయే 3 రోజుల పాటు ఇదే వాతావరణం ఉండవచ్చు. అంతకుముందు, కాన్పూర్ టెస్టులో మొదటి 3 రోజులు వర్షం అడ్డుకున్న సంగతి తెలిసిందే.

సిద్ధం కావడానికి తగినంత సమయం: టామ్ లాథమ్

ప్రతికూల వాతావరణం కారణంగా, మాకు సిద్ధం కావడానికి తగినంత సమయం లభించలేదు. కానీ, వికెట్ చాలా సేపు కప్పబడి ఉంది. వర్షం కూడా కురిసింది. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్ బౌలర్లకు సహకరిస్తుందని ఆశిస్తున్నాను అంటూ కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.

భారీ స్కోర్ చేయాలనే టాస్ ఎంచుకున్నాం: రోహిత్

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ- భారీ స్కోరు చేయాలనుకుంటున్నాం, అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్ మొదట్లో బౌలర్లకు ఉపయోగపడుతుంది. కానీ, వికెట్ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకుంటున్నాం. అందుకే, ముందుగా బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు.

ఇరు జట్లు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..