India Win: ఐదు రోజుల టెస్టు రెండ్రోజులకే సరి.. మోతెరా పిచ్‌లో తిప్పేసిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం

నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా 49 పరుగుల చిన్న టార్గెట్‌తొ బరిలోకి దిగింది.

India Win: ఐదు రోజుల టెస్టు రెండ్రోజులకే సరి.. మోతెరా పిచ్‌లో తిప్పేసిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం
india win
Follow us

|

Updated on: Feb 25, 2021 | 8:45 PM

india vs england: నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా 49 పరుగుల చిన్న టార్గెట్‌తొ బరిలోకి దిగింది. ఆ జట్టు నిర్దేశించిన 49 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది.

ధోనీని బీట్ చేసిన కోహ్లీ..

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ దాటేశాడు. స్వదేశంలో అత్యధిక టెస్టుల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 21 విజయాలతో ధోనీ తొలి స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆ రికార్డును కోహ్లీ సమం చేశాడు.  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో విజయం ద్వారా ఆ రికార్డును కోహ్లీ దాటేశాడు. మొత్తం 22 విజయాలతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.

మొతేరాలో అక్షర సత్యం..

మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 70 పరుగులిచ్చిన అక్షర్.. 11 వికెట్లు తీయడం విశేషం. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో డే-నైట్ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డు.

అశ్విన్‌ ఖాతాలో 400 వికెట్లు

ఇంగ్లండ్‌ జట్టును అశ్విన్‌ తన రెండు వరుస ఓవర్లలో దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ 23వ ఓవర్‌ తొలి బంతికే ఆర్చర్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన అశ్విన్ టెస్టుల్లో 400 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ 68 పరుగుల వద్ద ఏడో వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కేవలం 35 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.అంతకముందు‌ అశ్విన్‌ బౌలింగ్‌లోనే 21వ ఓవర్‌ చివరి బంతికి ఓలీ పోప్‌ ఎల్బీగా వెనుదిరగడంతో ఆరో వికెట్‌ నష్టపోయింది.

ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. భారత్‌ టార్గెట్ 49 పరుగులు

పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. దీంతో 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్‌ 19 పరుగులతో సరిపెట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 5 వికట్లు, అశ్విన్‌ 4, సుందర్‌ ఒక వికెట్‌ తీశాడు.

ఇవి కూడా చదవండి

India vs England 3rd Test Live: మెరిసిన లోకల్ బాయ్..మూడో టెస్ట్‌‌లో రెండో రోజు ఇంగ్లాండ్ ఆలౌట్

దెయ్యం భయంతో ఖాళీ అయిన ఊరు.. చూసినవారు చూసినట్టే చనిపోతున్నారని వణికిపోతున్న గ్రామం

PM-KISAN Scheme: పీఎం-కిసాన్‌ పథకంలో రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు బదిలీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..