India vs England: టీమిండియా ముందు స్మాల్ టార్గెట్… స్పిన్ మాయాజాలం బాగా పని చేసిందోచ్..
నరేంద్రమోదీ స్టేడియంలో పింక్ బాల్ మ్యాచ్ రెండో రోజు కూడా టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక ఈ టెస్టులో విరాట్ కోహ్లీ సేనకు గెలుపు దాదాపు ఖరారైంది.
India vs England 3rd Test : నరేంద్రమోదీ స్టేడియంలో పింక్ బాల్ మ్యాచ్ రెండో రోజు కూడా టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక ఈ టెస్టులో విరాట్ కోహ్లీ సేనకు గెలుపు దాదాపు ఖరారైంది.సెకండ్ సెషన్‌లో టీమిండియా స్పిన్నర్లు మరింతగా విజృంభించడంతో ఇంగ్లాండ్ వందలోపే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైన ఇంగ్లాండ్.. భారత్‌కు 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల్లాడింది. లోకల్ బాయ్ అక్షర్ పటేల్(5/32), రవిచంద్రన్ అశ్విన్(4/48) ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించారు. ఈ ఇద్దరి స్పిన్ మంత్రం ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిలబడలేక పోయారు. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లలో జో రూట్(19), బెన్‌స్టోక్స్(25), ఓలీ పోప్(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న జాక్ క్రాలే(0), డొమినిక్ సిబ్లే(7), జానీ బెయిర్‌స్టో(0), బెన్ ఫోక్స్(8) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.
Milestones ✅ Fifers ✅ Wickets galore ✅
We’ve witnessed it all on Day 2️⃣ here in Ahmedabad ??#TeamIndia need 4️⃣9️⃣ runs to win #INDvENG #PinkBallTest @Paytm
Follow the match ? https://t.co/9HjQB6TZyX pic.twitter.com/T4Rr039HW3
— BCCI (@BCCI) February 25, 2021
టెస్టుల్లో 400 వికెట్
ఇంగ్లండ్ జట్టును అశ్విన్ తన రెండు వరుస ఓవర్లలో దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 23వ ఓవర్ తొలి బంతికే ఆర్చర్‌ను ఎల్బీగా వెనక్కి పంపిన అశ్విన్ టెస్టుల్లో 400 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 68 పరుగుల వద్ద ఏడో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ కేవలం 35 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.అంతకముందు అశ్విన్ బౌలింగ్‌లోనే 21వ ఓవర్ చివరి బంతికి ఓలీ పోప్ ఎల్బీగా వెనుదిరగడంతో ఆరో వికెట్ నష్టపోయింది.
Remarkable feat for @ashwinravi99! ??
The champion spinner entered the esteemed club of wicket-takers as he trapped Jofra Archer LBW to claim Test wicket no. 4⃣0⃣0⃣. ??@Paytm #INDvENG #TeamIndia #PinkBallTest
Watch that memorable moment ??
— BCCI (@BCCI) February 25, 2021
MOOD ??@Paytm #INDvENG #TeamIndia #PinkBallTest
Follow the match ? https://t.co/9HjQB6TZyX pic.twitter.com/yw2CH6EBh8
— BCCI (@BCCI) February 25, 2021
రెండవ రోజు…
అంతకు ముందు పింక్ బాల్ టెస్టులో రూట్ దెబ్బకు టీమిండియా ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు ఇంటి దారి పట్టారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు తడబడిన పిచ్‌పై ఆతిథ్య బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలిచేందుకు తంటాలు పడ్డారు. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్, కెప్టెన్ జో రూట్ స్పిన్ దెబ్బకు టీమిండియా వికెట్లు వరసగా పడేశారు. ఈ జోడీ పోటీపడి వికెట్లు తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 53.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాకు 33 పరుగుల ఆధిక్యం లభించింది.
ముందు రోజు..
ముందు రోజు.. పింక్‌బాల్ టెస్టులో టీమ్‌ఇండియా రెండో రోజు ఆట ప్రారంభించింది. 99/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో గురువారం రోహిత్(57), రహానె(1) బ్యాటింగ్ ఆరంభించారు. అంతకు ముందు టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(27).. లీచ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్(11), చతేశ్వర్ పుజారా(0)ల వికెట్లను వరుస ఓవర్లలో చేజార్చుకుంది. జోఫ్రా ఆర్చర్ వేసిన 15 ఓవర్ చివరి బంతికి గిల్ ఔట్ కాగా, ఆపై వచ్చిన పుజారా సైతం నిరాశపరిచాడు.