IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్‌లో వరుణ్ ‘పాంచ్’ పటాకా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

India vs England 3rd T20I: రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ముందు 172 పరుగుల టార్గెట్ నిలిచింది. ఇంగ్లండ్ తరపున బెన్ డకెట్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్‌లో వరుణ్ పాంచ్ పటాకా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
Ind Vs Eng 3rd T20i

Updated on: Jan 28, 2025 | 8:49 PM

India vs England 3rd T20I: రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ముందు 172 పరుగుల టార్గెట్ నిలిచింది. ఇంగ్లండ్ తరపున బెన్ డకెట్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 43 పరుగులు, జోస్ బట్లర్ 24 పరుగులు చేయగా, మిగతా ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా 2, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. 14 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షమీ తన ఖాతాలో వికెట్ వేసుకోలేకపోయాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టన్, జేమీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..