- Telugu News Photo Gallery Cricket photos Champions Trophy 2025 from david miller to lungi ngidi and Wiaan Mulder including 8 players from South Africa were injury concerns
ఇదేం బ్యాడ్ లక్ సామీ.. గాయపడిన ఒకే జట్టులోని 8మంది ప్లేయర్లు.. టెన్షన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ టీం
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఒక జట్టు టెన్షన్ తీరడం లేదు. ఇప్పటి వరకు ఈ జట్టులోని 8 మంది ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ ఆటగాళ్లలో కొందరు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టులో కూడా ఉన్నారు. తాజాగా ఈ జట్టులోని ఓ కీలక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ కూడా గాయపడ్డాడు.
Updated on: Jan 28, 2025 | 8:32 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 8 జట్లు ఆడనున్నాయి. అయితే, ఈ టోర్నీకి ముందు ఒక జట్టు టెన్షన్‌కు తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో ఈ టీమ్‌లోని 8 మంది ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడుతుండగా.. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ జట్టు కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో ఈ జట్టుకు అతిపెద్ద దెబ్బ తగిలింది. పార్ల్ రాయల్స్ వర్సెస్ డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ గాయపడ్డాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్ల గాయాలు కొనసాగుతున్నాయి. పార్ల్ రాయల్స్ వర్సెస్ డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ గాయపడ్డాడు. నిజానికి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ మిల్లర్ గాయపడ్డాడు. అతను కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో షాట్‌ను ఆపడానికి ప్రయత్నించినప్పుడు గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా, అతను సహాయక సిబ్బందితో కలిసి మైదానాన్ని విడిచిపెట్టాడు. రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో మిల్లర్ బ్యాటింగ్ చేయలేదు. మొత్తం సమయం డగౌట్‌లో కూర్చున్నట్లు కనిపించాడు.

మ్యాచ్ తర్వాత, డేవిడ్ మిల్లర్ కూడా తన గాయంపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. నా నడుముతో ఇబ్బంది ఉన్నట్లు డేవిడ్ మిల్లర్ చెప్పాడు. నేను విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి పరిస్థితి మరింత దిగజారకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ భాగమైన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో అతని గాయం జట్టుకు పెద్ద దెబ్బ. అతని కంటే ముందు, ఎన్రిక్ నార్సియా కూడా వెన్ను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇంతలో, గెరాల్డ్ కోయెట్జీ స్నాయువు సమస్యతో బాధపడుతున్నాడు.

ఈ స్టార్ ప్లేయర్‌లతో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్న లుంగీ ఎన్‌గిడి, వియాన్ ముల్డర్ కూడా గాయపడ్డారు. మరోవైపు లిజాడ్ విలియమ్స్, నాండ్రే బెర్గర్, డారిన్ డుపావిలాన్, ఒట్నియల్ బార్ట్‌మన్ కూడా గాయంతో బాధపడుతున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రసీస్ వాన్.




