AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : ఆస్ట్రేలియా టూర్‌కి టీమిండియా సిద్ధం.. లండన్ నుంచి వెళ్లని విరాట్ కోహ్లీ..తన ప్లాన్ ఏంటంటే ?

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సుదీర్ఘ టూర్ కోసం టీమిండియా అక్టోబర్ 15వ తేదీన రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది.

Virat Kohli : ఆస్ట్రేలియా టూర్‌కి టీమిండియా సిద్ధం.. లండన్ నుంచి వెళ్లని విరాట్ కోహ్లీ..తన ప్లాన్ ఏంటంటే ?
Virat Kohli
Rakesh
|

Updated on: Oct 08, 2025 | 8:57 PM

Share

Virat Kohli : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సుదీర్ఘ టూర్ కోసం టీమిండియా అక్టోబర్ 15వ తేదీన రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. త్వరలో రాబోయే ఐసీసీ టోర్నమెంట్‌ల దృష్ట్యా ఈ సిరీస్ రెండు జట్లకు చాలా కీలకం కానుంది.

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో ఆడనున్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లండన్‌లో బ్రేక్ టైం ఎంజాయ్ చేస్తున్నాడు. కోహ్లీ మొదట లండన్ నుంచి ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాతే మిగతా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటన కోసం బయలుదేరుతారు. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు.. విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు అక్టోబర్ 15న లేదా అంతకు ఒక రోజు ముందు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచే భారత ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాకు ఒకే జట్టుగా ప్రయాణం అవుతారు.

భారత్ vs ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్

వన్డే సిరీస్

భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మొదలవుతాయి.

మొదటి వన్డే: అక్టోబర్ 19, పెర్త్

రెండవ వన్డే: అక్టోబర్ 23, అడిలైడ్

మూడవ వన్డే: అక్టోబర్ 25, సిడ్నీ

టీ20 సిరీస్

వన్డే సిరీస్ ముగిసిన తర్వాత, రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల నుంచి మొదలవుతాయి.

మొదటి టీ20: అక్టోబర్ 29, కాన్‌బెర్రా

రెండవ టీ20: అక్టోబర్ 31, మెల్‌బోర్న్

మూడవ టీ20: నవంబర్ 2, హోబర్ట్

నాల్గవ టీ20: నవంబర్ 6, గోల్డ్ కోస్ట్

ఐదవ టీ20: నవంబర్ 8, బ్రిస్బేన్

ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసి సిరీస్‌ను గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా