AUS vs PAK : మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతం..పాకిస్తాన్‌కు చుక్కలు చూపిన బెత్ మూనీ
మహిళల ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన పోరాటం కనిపించింది. ఒకానొక దశలో ఆస్ట్రేలియా జట్టు కేవలం 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, ఈ స్థితిలో ఆ జట్టు బ్యాటర్ బెత్ మూనీ వీరోచిత పోరాటం చేసి, జట్టును గౌరవప్రదమైన 221 పరుగుల స్కోరుకు చేర్చింది.

AUS vs PAK : మహిళల ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన పోరాటం కనిపించింది. ఒకానొక దశలో ఆస్ట్రేలియా జట్టు కేవలం 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ స్థితిలో ఆ జట్టు బ్యాటర్ బెత్ మూనీ వీరోచిత పోరాటం చేసి, జట్టును గౌరవప్రదమైన 221 పరుగుల స్కోరుకు చేర్చింది. ఈ ప్రదర్శనతో ఆమెను క్రికెట్ అభిమానులు పురుషుల టీమ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్‌తో పోల్చడం మొదలుపెట్టారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు అలీసా హీలీ (20), ఫీబీ లిచ్‌ఫీల్డ్ (10), ఎలిస్ పెర్రీ (5) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. చూస్తుండగానే జట్టు 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా 150 పరుగులైనా చేస్తుందా అనే సందేహం కలిగింది. అయితే, ఒక వైపు క్రీజ్‌లో నిలదొక్కుకున్న బెత్ మూనీ, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌ల సాయంతో పోరాటం మొదలుపెట్టింది.
76 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టు కోసం బెత్ మూనీ తన అనుభవాన్ని ఉపయోగించింది. మొదట్లో కిమ్ గార్త్ (47 బంతుల్లో 11 పరుగులు)తో కలిసి 39 పరుగుల అద్భుతమైన పార్టనర్ షిప్ నెలకొల్పింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఎలేనా కింగ్‌తో కలిసి విధ్వంసం సృష్టించింది. ఈ జోడి ఏకంగా 106 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి పాకిస్తాన్ బౌలర్ల ఆశలపై నీళ్లు చల్లింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఆఫ్ఘనిస్తాన్‌పై 91/7 ఉన్న స్థితి నుంచి 201 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాను గెలిపించినట్లే, బెత్ మూనీ కూడా అదే తరహాలో జట్టును ఆదుకుంది.
పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న బెత్ మూనీ, అద్భుతమైన సెంచరీ పూర్తి చేసి 109 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు అండగా నిలిచిన ఎలేనా కింగ్ కూడా ఏమాత్రం తగ్గకుండా నాటౌట్ 51 పరుగులు చేసింది. వీరిద్దరి అజేయ భాగస్వామ్యం కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 221 పరుగులకు చేరుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో నాశరా సంధు అత్యధికంగా 3 వికెట్లు తీసింది. కెప్టెన్ ఫాతిమా సనా, రమీన్ షమీమ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




