Rohit Sharma : అరెయ్ అబ్బాయిలు.. ఇక పండగ చేస్కోండిరా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ
భారత వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించినప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ దిగ్గజ ఆటగాడికి ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గలేదని జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రజా నిరూపించారు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నప్పటికీ సికందర్ రజా తాను సెలక్ట్ చేసిన ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకున్నారు.

Rohit Sharma : భారత వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించినప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ దిగ్గజ ఆటగాడికి ఉన్న గౌరవం ఏ మాత్రం తగ్గలేదని జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రజా నిరూపించారు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నప్పటికీ సికందర్ రజా తాను సెలక్ట్ చేసిన ఆల్‌టైమ్ బెస్ట్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకున్నారు. ఇది హిట్‌మ్యాన్‌కు ప్రపంచవ్యాప్తంగా దక్కిన గొప్ప గౌరవాన్ని తెలియజేస్తుంది.
సికందర్ రజా ఎంపిక చేసిన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 జట్టులో అనేక మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మతో పాటు వెస్టిండీస్‌కు చెందిన విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్‌ను ఓపెనర్‌గా ఎంచుకున్నాడు. వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్కు అవకాశం ఇచ్చాడు. మిడిల్లో ఏబీ డివిలియర్స్, హెన్రిక్ క్లాసెన్, కైరన్ పొలార్డ్ వంటి పవర్ హిట్టర్లకు చోటు కల్పించాడు. భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజాకు ఆల్‌రౌండర్‌గా అవకాశం లభించింది. ఆశ్చర్యకరంగా, టీమిండియా దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి ఆటగాళ్లు ఈ జట్టులో లేకపోవడం గమనార్హం.
సికందర్ రజా సెలక్ట్ చేసిన టీ20 టీం మెంబర్స్ వీళ్లే..
క్రిస్ గేల్, రోహిత్ శర్మ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, హెన్రిక్ క్లాసెన్, కైరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, షాహిద్ అఫ్రిది, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాహిన్ అఫ్రిది (12వ ప్లేయర్)
సికందర్ రజా తన ఆల్‌టైమ్ జట్టుకు రోహిత్‌ను కెప్టెన్‌గా సెలక్ట్ చేసినప్పటికీ, భారత క్రికెట్ అభిమానుల దృష్టి మాత్రం రోహిత్ ఇంటర్నేషనల్ కెరీర్‌పైనే ఉంది. కెప్టెన్సీ కోల్పోయిన నేపథ్యంలో 2027 ప్రపంచ కప్ వరకు అతను జట్టులో కొనసాగడం కష్టంగా మారవచ్చు. రాబోయే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ ముగిసే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే, రోహిత్ దీన్ని సవాలుగా స్వీకరించి, తన ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి, దాదాపు 15 కిలోల బరువు తగ్గడం విశేషం. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ భారీగా పరుగులు చేస్తే, అతన్ని జట్టు నుంచి తప్పించడం సెలక్టర్లకు చాలా కష్టమవుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




