PAK vs AUS : ఛీ వీళ్ల బ్లడ్డే అంత.. తమ తప్పు పెట్టుకుని అంపైర్‌తో గొడవ..చుట్టుముట్టి బెదిరించిన ఐదుగురు పాక్ ప్లేయర్లు
మైదానంలో ఉన్న అంపైర్ తన నిర్ణయంపై పూర్తి విశ్వాసంతో ఉండటంతో, రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించలేదు. నిజానికి, బ్యాటర్ కిమ్ గార్త్ స్పష్టంగా నాటౌట్‌గా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారితీసింది.

PAK vs AUS : ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 9వ మ్యాచ్‌లో ఊహించని సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుని, ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను బాగా ఇబ్బంది పెట్టింది. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో పాకిస్తాన్ క్రీడాకారిణులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం అభిమానులను నిరాశపరిచింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్‌ను పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా వేసింది. ఆ ఓవర్‌లోని ఐదో బంతిని బెత్ మూనీ డీప్ మిడ్‌వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించింది. అయితే, కిమ్ గార్త్ రెండో పరుగు కోసం చాలా వేగంగా పరిగెత్తాల్సి వచ్చింది. ఈ సమయంలో ఫీల్డర్ విసిరిన త్రో నేరుగా వికెట్ల ముందు ఉన్న ఫాతిమా సనా చేతికి వచ్చింది. కిమ్ గార్త్ క్రీజ్‌కి చాలా దూరంగా ఉండటంతో, ఆమె రన్ అవుట్ అని స్పష్టంగా కనిపించింది.
అయితే, త్రో అందుకున్న ఫాతిమా సనా తొందరపాటులో బంతిని స్టంప్స్‌కు తగిలించడంలో పొరపాటు చేసింది. ఈ పొరపాటు కారణంగా కిమ్ గార్త్ ఈజీగా క్రీజ్‌లోకి చేరుకోగలిగింది. తమ కళ్ళముందే సులువుగా దొరికే వికెట్‌ను కోల్పోవడంతో ఫాతిమా సనా నిరాశతో బంతిని నేలపై కొట్టింది. ఆ తర్వాత అంపైర్ వైపు చూడగా, ఆయన నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో ఫాతిమా సనా సహా మరో నలుగురు పాకిస్తాన్ క్రీడాకారిణులు అంపైర్‌ను చుట్టుముట్టి, థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం రివ్యూ తీసుకోవాలని పట్టుబట్టారు.
మైదానంలో ఉన్న అంపైర్ తన నిర్ణయంపై పూర్తి విశ్వాసంతో ఉండటంతో, రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించలేదు. నిజానికి, బ్యాటర్ కిమ్ గార్త్ స్పష్టంగా నాటౌట్‌గా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారితీసింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఒకానొక దశలో ఆస్ట్రేలియా జట్టు కేవలం 60 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. అలాగే, 76 పరుగులకే మరో రెండు వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ, ఒకవైపు బెత్ మూనీ క్రీజ్‌లో నిలబడి హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




