AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s World Cup : శ్రీరాముడిని గుర్తు చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్.. విల్లు-బాణంతో అద్భుతమైన సెంచరీ సెలబ్రేషన్

టాజ్మిన్ బ్రిట్స్ సెంచరీ పూర్తయిన వెంటనే, మోకాలిపై కూర్చుని తన చేతులతో విల్లు-బాణం సంధించినట్లుగా ఫోజు ఇచ్చింది. ఈ స్పెషల్ సెలబ్రేషన్ చూసిన భారతీయ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. దేశంలో దసరా పండుగ వాతావరణం ఉన్న సమయంలో బ్రిట్స్ చేసిన ఈ సెలబ్రేషన్ శ్రీరాముడి అద్భుతమైన లీలలను గుర్తు చేసిందని అంటున్నారు.

Women's World Cup : శ్రీరాముడిని గుర్తు చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్.. విల్లు-బాణంతో అద్భుతమైన సెంచరీ సెలబ్రేషన్
Tazmin Brits Lord Ram Celebration
Rakesh
|

Updated on: Oct 08, 2025 | 6:58 PM

Share

Women’s World Cup : భారత్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ 2025 క్రికెట్ పోటీలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ ప్లేయర్ టాజ్మిన్ బ్రిట్స్ తన సెంచరీని చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుని ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం దేశంలో దసరా పండుగ ముగిసి, దీపావళి రాబోతున్న నేపథ్యంలో బ్రిట్స్ తన సెంచరీని శ్రీరాముడి విల్లు-బాణం ఫోజు పెట్టి సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

టాజ్మిన్ బ్రిట్స్ సెంచరీ పూర్తయిన వెంటనే, మోకాలిపై కూర్చుని తన చేతులతో విల్లు-బాణం సంధించినట్లుగా ఫోజు ఇచ్చింది. ఈ స్పెషల్ సెలబ్రేషన్ చూసిన భారతీయ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. దేశంలో దసరా పండుగ వాతావరణం ఉన్న సమయంలో బ్రిట్స్ చేసిన ఈ సెలబ్రేషన్ శ్రీరాముడి అద్భుతమైన లీలలను గుర్తు చేసిందని అంటున్నారు. మైదానంలో బ్రిట్స్ యాక్షన్ చేసిన వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

టాజ్మిన్ బ్రిట్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ పవర్‌ఫుల్ బ్యాటర్ గత ఐదు వన్డే మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు సెంచరీలు నమోదు చేసింది. ఈ ఏడాది 2025లో ఆమె బ్యాట్ నుంచి ఇప్పటివరకు ఐదు సెంచరీలు వచ్చాయి. ఈ ప్రదర్శనతో బ్రిట్స్ మహిళల క్రికెట్‌లో ఒక సంవత్సరంలో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డు భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన (2024లో నాలుగు సెంచరీలు) పేరు మీద ఉండేది. స్మృతి మంధాన ఈ ఏడాది 2025లో కూడా నాలుగు సెంచరీలు చేసి బ్రిట్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 231 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 26 పరుగులకే తొలి వికెట్ కోల్పోయినా, టాజ్మిన్ బ్రిట్స్ సెంచరీ, కెప్టెన్ సునే లూస్ అజేయంగా చేసిన 83 పరుగుల ఇన్నింగ్స్ కారణంగా దక్షిణాఫ్రికా జట్టు కేవలం 40.5 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిట్స్ అద్భుతమైన బ్యాటింగ్‌కు గాను ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలో కేంద్రం నుంచి..
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
సెంచరీ మిస్ అయినా సంజూ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు?
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
అభిషేక్‎ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ కొట్టేసిన కేఎల్ రాహుల్
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
ఛీ కొట్టిన వాళ్లే హారతి పట్టి మరీ టీమిండియాలోకి రమ్మంటున్నారుగా..
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఈ పని చేస్తేనే..
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..
బుధవారం ఇలా చేస్తే శుభం.. విజయం మీది! కానీ అప్పు మాత్రం వద్దు..