AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో టాస్ గెలిచిన భారత్.. మారిన రోహిత్ ప్లేస్.. ప్లేయింగ్ 11లో 3 మార్పులు..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు నేటి నుంచి అడిలైడ్‌లో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పింగక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేయనుంది. సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. పెర్త్ టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అడిలైడ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరగ్గా, భారత్ ఇక్కడ 2 గెలిచింది.

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో టాస్ గెలిచిన భారత్.. మారిన రోహిత్ ప్లేస్.. ప్లేయింగ్ 11లో 3 మార్పులు..
Ind Vs Aus 2nd Test Toss
Venkata Chari
|

Updated on: Dec 06, 2024 | 9:15 AM

Share

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు నేటి నుంచి అడిలైడ్‌లో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పింగక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేయనుంది. సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. పెర్త్ టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అడిలైడ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరగ్గా, భారత్ ఇక్కడ 2 గెలిచింది.

2020-21 మాదిరిగానే, ఈసారి కూడా అడిలైడ్‌లో డే-నైట్ టెస్టు జరగనుంది. పింక్ బాల్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేయడానికి, ఆస్ట్రేలియా పీఎం-11తో భారత్ రెండు రోజుల వార్మప్ గేమ్ ఆడింది. అక్కడ భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేపటి మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తిరిగి రానున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us