IND vs AUS: మరికొన్ని గంటల్లో భారత్ vs ఆసీస్ రెండో టీ20.. రవి బిష్ణోయ్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్- XI ఇదే
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత యువ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆదివారం (నవంబర్ 26) తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత యువ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆదివారం (నవంబర్ 26) తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది . తద్వారా 5 మ్యాచ్ ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లాలని భావిస్తోంది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా జట్టు ప్రయత్నిస్తుంది. గత మ్యాచ్‌లో గెలుపు అంచుల్లోకి వచ్చి ఓడిపోయిన ఆసీస్ తిరువనంతపురంలో మరింత ధాటిగా ఆడే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ టీమ్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మ్యాచ్‌లో విజయం సాధించడానికి పిచ్ ప్రకారం సరైన ప్లేయింగ్-11ని ఎంచుకోవాలి.
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, ఈ సిరీస్‌లో భారత జట్టు సిరీస్‌లో మరింత ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. అదే జరిగితే ఆస్ట్రేలియాకు మరిన్ని కష్టాలు పెరుగుతాయి. ఈ మైదానాన్ని చూస్తే.. రాత్రి వేళల్లో ఫాస్ట్ బౌలర్లకు సాయం అందిస్తోంది. ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యం ఉన్న ఈ మైదానంలో మూడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌తో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ తన ప్లేయింగ్-11లో ఏమైనా మార్పులు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. తొలి మ్యాచ్‌లో భారత్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో తలపడింది. ఈ మ్యాచ్ రాత్రిపూట జరగనుంది కాబట్టి ఫాస్ట్ బౌలర్లకు మరింత సపోర్టు ఉంటుంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, టీమ్ ఇండియా ఒక స్పిన్నర్ స్థానంలో అదనపు ఫాస్ట్ బౌలర్‌ను తీసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తొలి మ్యాచ్‌లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఆడాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బిష్ణోయ్‌ని కూర్చోబెట్టి అవేష్ ఖాన్‌ను ఆడించవచ్చు. ఒక వేళ స్పిన్నర్ అవసరం ఉంటే తిలక్ వర్మ పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్, యశస్వి జైస్వాల్ పార్ట్ టైమ్ లెగ్ స్పిన్ చేయగలరు.
ప్రాక్టీసులో టీమిండియా ఆటగాళ్లు..
View this post on Instagram
బ్యాటింగ్‌లో మార్పులు
గత మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడారు. ఇక రింకూ సింగ్ తన ఫినిషింగ్ స్కిల్స్‌తో టీమ్‌ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. కాబట్టి బ్యాటింగ్ విభాగంలో టీమ్ ఇండియా ఎలాంటి మార్పులు చేసేలా కనిపించడం లేదు.
టీమ్ ఇండియా ప్లేయింగ్-11 (అంచనా) :
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్.
ఫొటో షూట్ లో టీమిండియా ప్లేయర్స్
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








