Ind vs Afg: విజయంతో టోర్నీకి గుడ్ బై చెప్పేనా.. ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్ ఆడనున్న భారత్.. ఇరుజట్ల ప్లేయింగ్ XI?

అంతర్జాతీయ టీ20లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు మొత్తం 3 మ్యాచ్‌లు ఆడాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది.

Ind vs Afg: విజయంతో టోర్నీకి గుడ్ బై చెప్పేనా.. ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్ ఆడనున్న భారత్.. ఇరుజట్ల ప్లేయింగ్ XI?
Ind Vs Afg Asia Cup 2022
Follow us
Venkata Chari

|

Updated on: Sep 08, 2022 | 5:55 PM

India Vs Afghanistan Asia Cup 2022: ఆసియాకప్‌లో భాగంగా నేడు దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో భారత్‌ తన చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఇంతకుముందు, ఆసియా కప్‌లో సూపర్-4లో 2 మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా ఫైనల్ రేసుకు దూరమైంది. నేటి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలంటే భారత జట్టు చాలా కష్టపడాల్సి ఉంటుంది. భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్ల ఫామ్ సరిగా లేకపోవడమే దీనికి అతిపెద్ద కారణం. భారత టాప్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మరోవైపు భారత ఫాస్ట్ బౌలర్లు కూడా రాణించలేకపోయారు. తొలి మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్.. ఆ తర్వాత రాణించలేకపోయాడు.

కాగా, బుధవారం పాకిస్థాన్‌కు ఆఫ్ఘనిస్థాన్ జట్టు గట్టిపోటీనిచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో ఓడిపోయినా, అంతకు ముందు ఆసియా కప్‌లో గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఓడించింది. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కి ఇదే చివరి మ్యాచ్‌ కూడా. స్టార్ స్పోర్ట్స్‌లో ఈ సూపర్ 4 మ్యాచ్‌ని ఇరు జట్ల అభిమానులు వీక్షించవచ్చు. హాట్‌స్టార్ ఈ మ్యాచ్‌ని ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తుంది.

ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయంతో టోర్నీ ముగించాలని కోరుకుంటోంది..

ఇవి కూడా చదవండి

రెండు జట్లకు ఒకే విధమైన కథ ఉంది. గ్రూప్ దశలో రెండు ఆసియా జట్లు ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచాయి. గ్రూప్ దశలో పాకిస్థాన్, హాంకాంగ్‌లను భారత్ ఓడించింది. మరోవైపు గ్రూప్ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. సూపర్ 4లో ఈ జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పాయింట్ల పట్టికలో తమ ఖాతా తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

అంతర్జాతీయ టీ20లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు మొత్తం 3 మ్యాచ్‌లు ఆడాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది.

2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆఫ్ఘనిస్థాన్‌కు 211 పరుగుల లక్ష్యాన్ని అందించారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 74 పరుగులు చేశాడు. జవాబుగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 3 వికెట్లు తీశాడు.

భారత్ తమ చివరి మ్యాచ్‌లోనూ ఇక్కడ ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరుకుంటోంది. ఇది చేయాలంటే, భారత టాప్-3 బ్యాట్స్‌మెన్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. హార్దిక్ పరుగులు చేయవలసి ఉంటుంది. బౌలర్లు కూడా తమ ఫామ్‌ను తిరిగి పొందవలసి ఉంటుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిస్తేనే..

ఈ మ్యాచ్ యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. గత మ్యాచ్‌ల నుంచి దుబాయ్ పిచ్ కాస్త నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్‌లోని పిచ్‌ బౌలర్లకు మేలు చేస్తుంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం సులభం అవుతుంది.

ఈ ఆసియా కప్‌లో దుబాయ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు నిరాశే ఎదురైంది. కాబట్టి కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాడు.

భారత్-ఆఫ్ఘనిస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI

ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, కరీం జనత్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, మజీబ్ ఉర్ రెహమాన్, ఫరీద్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూ

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..