ENG U19 vs IND U19, Final: టాస్ గెలిచిన యంగ్ ఇండియా.. అందరి చూపు ఐపీఎల్ సెన్సేషన్ పైనే..?
ENG U19 vs IND U19, Final: హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన 56 యూత్ వన్డేల్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. టీం ఇండియా 41 గెలవగా, ఇంగ్లాండ్ 13 మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ENG U19 vs IND U19, Final: ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన భారత్ నేడు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు రికార్డు స్థాయిలో 10వ సారి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు 1998లో తమ ఏకైక టైటిల్‌ను గెలుచుకున్న ఇంగ్లాండ్ మూడోసారి ఫైనల్‌కు చేరుకోనుంది. గతంలో, 2022 ఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఐదవసారి ట్రోఫీని గెలుచుకుంది.
ఇప్పటివరకు భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన 56 యూత్ వన్డేల్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. టీం ఇండియా 41 గెలవగా, ఇంగ్లాండ్ 13 మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
హరారే పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. బౌలర్లకు కొంత మద్దతును అందిస్తుంది. ఈ పిచ్ మంచి బౌన్స్, పేస్‌ను అందిస్తుంది. షాట్లు ఆడటం సులభం చేస్తుంది. స్క్వేర్, స్ట్రెయిట్ బౌండరీలు తక్కువగా ఉంటాయి. ఫోర్లు, సిక్సర్‌లను కొట్టడం ఈజీ అవ్వనుంది. రెండవ సెమీ-ఫైనల్‌లో భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి మొత్తం 621 పరుగులు సాధించడం గమనార్హం.
ఇరు జట్లు:
It’s time for a massive showdown! 🔥
Who will take away the coveted trophy at the #U19WorldCup 2026 🏆
Find out how to watch 👉 https://t.co/xPyPKzGMQU pic.twitter.com/gdZopID6Pk
— ICC (@ICC) February 6, 2026
ఇంగ్లాండ్ U19 (ప్లేయింగ్ XI): బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్, థామస్ రెవ్ (కెప్టెన్, కీపర్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్.
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
