IND vs SL: శ్రీలంకతో సిరీస్ కోసం నేడే జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు మొండిచేయి.. కెప్టెన్‌గా ఎవరంటే?
న్యూజిలాండ్ టూర్‌లో భారత్ చివరి టీ20 సిరీస్ ఆడింది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు.

IND vs SL: టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జనవరి 03 నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయలేదు. కాబట్టి పాత కమిటీ మాత్రమే ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తుంది. టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ చివరి టీ20 సిరీస్ ఆడింది. చాలా మంది యువ ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించింది. శ్రీలంకపై ఆడే భారత జట్టులో చాలామంది యువకులే ఉండనున్నారని తెలుస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో కొన్ని మార్పులు ఉండవచ్చు. అందులో రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతి ఇవ్వవచ్చు. అయితే రాహుల్ త్రిపాఠిని జట్టులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు.
టీ 20 జట్టు ఇలా ఉండొచ్చు – హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సిరాజ్, మహ్మద్ సిరాజ్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.




వన్డే సిరీస్ గురించి మాట్లాడితే, కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి వచ్చి జట్టుకు నాయకత్వం వహిస్తాడు. బంగ్లాదేశ్ టూర్‌లో వన్డే సిరీస్ ఆడే జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో కూడా అవకాశం దక్కుతుంది. బంగ్లాదేశ్ టూర్ టీమ్‌లో కేఎల్ రాహుల్, కుల్దీప్ సేన్ ఉన్నారు. అయితే శ్రీలంకతో సిరీస్ నుంచి వారిని తొలగించవచ్చని తెలుస్తోంది.
వన్డే జట్టు ఇలా ఉండొచ్చు – రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..