Year Ender 2022: ప్రపంచకప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్.. ఈ ఏడాది షాకిచ్చిన మరో 10 మంది దిగ్గజాలు..
Retired Cricketers in 2022: ఈ సంవత్సరం ప్రపంచ కప్ విజేత ఇయాన్ మోర్గాన్ వంటి కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతడితో పాటు పలువురు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

Retired Cricketers List 2022: ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా చాలా మంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ సమయంలో కొందరు రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నారు. మరికొందరిలో క్రికెట్ మిగిలి ఉంది. కొంతమంది క్రికెటర్లు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లలో, గతంలో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ఏడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన కొంతమంది స్టార్ క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇయాన్ మోర్గాన్..
ఇంగ్లండ్ ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచకప్ గెలిచిన తర్వాత వచ్చే ప్రపంచకప్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ నిలిచాడు. ప్రపంచకప్ తర్వాత అతను పెద్ద ఇన్నింగ్స్‌లేవీ ఆడలేకపోయాడన్నది నిజం. అతని నాయకత్వంలో ఇంగ్లాండ్ 2019 సంవత్సరంలో మొదటిసారి క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలు..
వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా పొలార్డ్ పేరిట ఉంది. వీరితో పాటు విండీస్ జట్టుకు చెందిన దినేష్ రామ్‌దిన్, లెండిల్ సిమన్స్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ మారిస్, శ్రీలంకకు చెందిన సురంగ లక్మల్, న్యూజిలాండ్‌కు చెందిన హమీస్ బెన్నెట్, భారత్‌కు చెందిన రాబిన్ ఉతప్ప కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యారు. ఈ క్రికెటర్లందరితో పాటు, ఇంగ్లాండ్ ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు, శ్రీలంకకు చెందిన గుణతిలక టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.




మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..