AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: మూడో ప్రపంచ కప్ అందించే 15 మంది ఆటగాళ్లు.. ఆ ముగ్గురు రీఎంట్రీ ఇస్తే ప్రత్యర్థులకు వణుకే..

Team India Probable Squad: అక్టోబర్ 8, 2023.. భారత క్రికెట్ జట్టు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించేందుకు తన ప్రచారాన్ని ప్రారంభించే తేదీ. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది.

Team India: మూడో ప్రపంచ కప్ అందించే 15 మంది ఆటగాళ్లు.. ఆ ముగ్గురు రీఎంట్రీ ఇస్తే ప్రత్యర్థులకు వణుకే..
Team India Schedule
Venkata Chari
|

Updated on: Jun 28, 2023 | 9:25 AM

Share

అక్టోబర్ 8, 2023.. భారత క్రికెట్ జట్టు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించేందుకు తన ప్రచారాన్ని ప్రారంభించే తేదీ. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది. టైటిల్ కోసం భారత్ నిరీక్షణకు ముగింపు పలకాలని అంతా కోరుకుంటున్నారు. అయితే, ట్రోఫీ అందించే ఆటగాళ్లు ఎవరు, భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చగల ప్లేయర్లు ఎవరంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.

మంగళవారం, జూన్ 27, వన్డే ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించారు. దాదాపు 7 వారాలు (46 రోజులు) జరిగే ఈ టోర్నీలో లీగ్ దశలో ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్, ఫైనల్‌ ఆడే జట్లేవో తెలియనున్నాయి. అయితే, ప్రస్తుతం టీమిండియా స్వ్కాడ్‌పైనే చర్చ నడుస్తోంది. ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరు ఔట్ అవుతారు? అంటూ వార్తలు వస్తున్నాయి.

ముగ్గురు ఆటగాళ్లపై సస్పెన్స్..

ప్రతి ప్రపంచకప్ మాదిరిగానే ఈసారి కూడా టోర్నీకి 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును మాత్రమే ఎంపిక చేయవచ్చు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా భారత జట్టు గత కొన్ని నెలలుగా చాలా మంది ఆటగాళ్లు లేకుండానే ఆడుతోంది. ఇందులో జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. వీరిలో కూడా పంత్ ఆడటం కష్టమే. అయితే, మిగతా ముగ్గురు ఫిట్‌గా ఉండగలిగితే భారత్ బలం పెరగడం ఖాయం.

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ లేదా శ్రేయాస్ అయ్యర్?

భారత జట్టు బ్యాటింగ్ గురించి మాట్లాడితే, టాప్ ఆర్డర్‌లో మొదటి మూడు స్థానాలు స్పష్టంగా ఉన్నాయి – కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనింగ్ జోడీ శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నారు. మిడిల్ ఆర్డర్‌పైనే ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం. శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉండి, టోర్నీ ప్రారంభానికి ముందు మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తే, అతని స్థానం నాలుగో స్థానంలో స్థిరపడుతుంది.

సూర్యకుమార్ యాదవ్ స్థానం అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్రపంచ కప్‌కు ముందు ఈ ఫార్మాట్‌లో తనను తాను నిరూపించుకుంటే, జట్టులో అతని స్థానం ఖాయం. మంచి ఫామ్‌లో ఉంటే, అయ్యర్‌ను కూడా భర్తీ చేయగలడు.

వికెట్ కీపర్ ఎవరు?

వికెట్‌కీపర్‌ సమస్య భారత్‌కు కాస్త ఇబ్బందికరమే. ఇక్కడ పంత్ మిస్ అవుతాడు. అతని ప్రత్యామ్నాయంగా, ఇషాన్ కిషన్ సహజంగా ఎంపికలో కనిపిస్తున్నాడు. అతను జట్టులో చోటు సంపాదించగలడు. కానీ, అతను సంజు శాంసన్‌తో పోటీపడవచ్చు. మిడిల్ ఆర్డర్ లేదా ఫినిషర్‌గా ఇషాన్ కంటే శాంసన్ ముందుండడమే దీనికి ప్రధాన కారణం.

అయినప్పటికీ, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ మొదటి ఎంపిక. దీనికి పెద్ద కారణం అతని బ్యాకప్ ఓపెనర్ బాధ్యత కూడా తీసుకుంటాడు. అలాగే మిడిలార్డర్‌లో అతని ప్రదర్శన కూడా బాగుంది.

ఆల్ రౌండర్లు, బౌలర్లకు స్లాట్ ఫిక్స్..

ఆల్‌రౌండర్ల కోసం టీమిండియాకు మంచి ఎంపికలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో మాత్రమే కాకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా భాగం కానున్నారు. స్పిన్-ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బ్యాకప్ లేదా పేసర్-ఆల్-రౌండర్ శార్దూల్ ఠాకూర్‌గా చోటు దక్కించుకుంటారా అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. ఈ విషయంలో అక్షర్ పైచేయి భారీగా కనిపిస్తోంది.

బౌలింగ్‌లో భారత్‌కు బలమైన ఎంపికలు ఉన్నాయి. అయితే అత్యంత ముఖ్యమైన విషయం జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్. అతను ఫిట్‌గా ఉంటే బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లు టీమిండియాకు అందుబాటులో ఉంటారు. అవసరాన్ని బట్టి 3 పేసర్లు లేదా ఇద్దరు పేసర్లతో దిగవచ్చు. స్పిన్నర్ల విషయానికొస్తే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ జట్టులో ఉండటం ఖాయం. అయితే ఇద్దరూ ప్లేయింగ్ XIలో కలిసి రావడం కష్టమే.

ప్రపంచ కప్‌ బరిలో టీమిండియా ప్రాబబుల్ స్వ్కాడ్..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిద్రాజ్, మహమ్మద్ సిద్రాజ్, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..