World Cup 2023: టీమిండియా బిజీ షెడ్యూల్.. వన్డే ప్రపంచ కప్ సమరానికి ముందు నాలుగు దేశాలతో సిరీస్‌లు..
Team India Schedule: వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఈసారి టోర్నీలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుండగా.. అదే సమయంలో, టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది.

Team India Schedule World Cup 2023: వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఈసారి టోర్నీలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుండగా.. అదే సమయంలో, టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. వన్డే ప్రపంచకప్ 2023కు ముందు రోహిత్ సేన షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఆసియా కప్‌తో పాటు నాలుగు జట్లతో సిరీస్ ఆడనుంది. జులైలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.
జులై-ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఆగస్టులో ఐర్లాండ్ టీంతో 3 మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ ఆడాల్సి ఉంది. సెప్టెంబరులో ఆసియా కప్ 2023లో టీమిండియా పాల్గొననుంది. ఆ తర్వాత, అదే నెలలో, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో తలో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు ప్రపంచకప్‌కు ముందు చాలా బిజీగా ఉంటుంది.
వెస్టిండీస్ పర్యటన తర్వాత భారత జట్టు ఐర్లాండ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 18న భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆగస్టు 20న జరగనుంది. సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.




వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా టీంతో ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ ఉంటుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసక్తికరంగా టీమిండియా ఆడబోయే 9 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు ఆదివారం నాడే ఉన్నాయి. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లతో భారత జట్టు ఆదివారం నాడు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు అక్టోబర్ 8, 15, 22, 29, నవంబర్ 5 తేదీల్లో జరుగుతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




