ODI World Cup 2023: టీమిండియా తలపడే 9 మైదానాలు ఇవే.. రికార్డులు చూస్తే జరంత టెన్షన్..
India Schedule ODI World Cup 2023: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా ఇప్పటివరకు 22 ODIలు ఆడింది. భారత్ 13 మ్యాచ్‌లు గెలుపొందగా, ప్రత్యర్థి జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

India Schedule Odi World Cup 2023: వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు తలో 9 మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత జట్టు తన 9 మ్యాచ్‌లను వివిధ స్టేడియాల్లో ఆడనుంది. ఈ తొమ్మిది స్టేడియాల్లో భారత జట్టు ఎలా రాణించిందో, గత రికార్డులపై ఓ కన్నేద్దాం..
India vs Australia: అక్టోబర్ 8న చెన్నై చెపాక్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఇరు జట్లు 3 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
India vs Afghanistan: అక్టోబర్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ స్టేడియంలో భారత జట్టు ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో 13 మ్యాచ్‌లు గెలిచి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దైంది.




India vs Pakistan: అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే హైవోల్టేజ్ పోరులో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు 18 వన్డేలు ఆడింది. ఇందులో టీమ్ ఇండియా 10 మ్యాచ్‌లు గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
India vs Bangladesh: అక్టోబర్ 19న పూణె వేదికగా జరిగే నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. పూణె మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 7 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
India vs New Zealand: అక్టోబర్ 22న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మైదానంలో భారత జట్టు మొత్తం 4 వన్డే మ్యాచ్‌లు ఆడగా, అందులో 2 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌లు ఓడిపోయింది.
India vs England: అక్టోబర్ 29న లక్నోలోని ఎకానా స్టేడియంలో టీమ్ ఇండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మైదానంలో ఆడిన ఏకైక వన్డే మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.
India vs Qualifier 2: నవంబర్ 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్వాలిఫయర్ రౌండ్ నుంచి ఎంపికైన 2వ జట్టుతో భారత్ ఆడుతుంది. ముంబైలోని ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 20 వన్డే మ్యాచ్‌లు ఆడగా అందులో 11 విజయాలు సాధించింది. మరో 9 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది.
India vs South Africa: నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మైదానంలో ఇరు జట్లు మొత్తం 3 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 2 సార్లు గెలిస్తే, దక్షిణాఫ్రికా ఒకసారి గెలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా ఓవరాల్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటి వరకు 22 వన్డేలు ఆడింది. భారత్ 13 మ్యాచ్‌లు గెలుపొందగా, ప్రత్యర్థి జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ రద్దయింది.
India vs Qualifier 1: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నవంబర్ 11న జరిగే క్వాలిఫయర్స్‌లో భారత్ టాప్ సీడ్‌తో తలపడనుంది. బెంగళూరులోని ఈ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడగా, అందులో 14 మ్యాచ్‌లు గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో 2 మ్యాచ్‌లు రద్దయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
