AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: బంగ్లాతో మ్యాచ్‌ టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌, పిచ్‌ రిపోర్ట్‌ ఇదే?

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతోంది. ఐదు రోజుల ముందే దుబాయ్‌కి చేరుకొని, ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్న రోహిత్‌ సేన, ఎప్పుడెప్పుడు గ్రౌండ్‌లోకి దూకాలా అనే కసితో ఉంది.

Champions Trophy: బంగ్లాతో మ్యాచ్‌ టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌, పిచ్‌ రిపోర్ట్‌ ఇదే?
India Vs Bangladesh
SN Pasha
|

Updated on: Feb 20, 2025 | 7:00 AM

Share

ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్‌ మూడో వన్డేల సిరీస్‌ ఆడిన టీమిండియా అందులో మంచి ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో జట్టు నెక్ట్స్‌ లెవెల్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం నల్లేరుపై నడకలానే అనిపిస్తున్నా.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని మాత్రం టీమిండియా మర్చిపోవద్దు. బంగ్లాదేశ్‌ను అస్సలు లైట్‌ తీసుకోవద్దని క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ కూడా హెచ్చరిస్తున్నారు. వాళ్లదైన రోజున బంగ్లాదేశ్‌ ఏ టీమ్‌నైనా ఓడిస్తుందని, ఆ ఛాన్స్‌ టీమిండియా వారికి ఇవ్వకుండా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్స్‌ పెట్టి కంఫర్ట్‌బుల్‌ విక్టరీ సాధించాలని క్రికెట్‌ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

అయితే.. టీమిండియా సూపర్‌ హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తున్నప్పటికీ.. జట్టులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్‌ బ్యాటర్లు రోకో జోడి పూర్తిగా ఫామ్‌లోకి వచ్చారా? లేదా ఒక్క ఇన్నింగ్స్ మెరుపులేనా అనేది బంగ్లాతో మ్యాచ్‌లో తేలిపోనుంది. అలాగే ఫాస్ట్‌ బౌలింగ్‌ సత్తా ఏంటో కూడా బయటపడుతుంది. జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడంతో జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ ఎటాక్‌ బలహీనపడిన విషయం ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. దానికి తోడు సెలెక్టర్లు సిరాజ్‌ను కూడా పక్కనపెట్టారు. షమీ ఉన్నా అంత మంచి రిథమ్‌లో కనిపించడం లేదు. అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా ఇద్దరూ యంగ్‌ బౌలర్లు. వన్డేల్లో పెద్దగా అనుభవం లేదు. దీంతో వారిద్దరిలో ఒకరు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉన్నా.. ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది కాస్త డౌట్‌గా మారింది.

మిడిల్డార్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ బాగానే ఆడుతున్నా.. కేఎల్‌ రాహుల్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌ రావాల్సి ఉంది. అతను కూడా సెట్‌ అయితే మిడిల్డార్‌ స్ట్రాంగ్‌ అయినట్లే. మరి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఈ బాక్స్‌లన్నీ టిక్‌ చేస్తుందని ఆశిద్దాం. ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా): రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌. పిచ్‌ రిపోర్ట్‌: దుబాయ్‌లోని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం రెండు ఫ్రెష్‌ పిచ్‌లను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దుబాయ్‌ పిచ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మిడిల్‌ ఓవర్స్‌లో స్పిన్‌ బౌలర్లకు కూడా అనుకూలిస్తుంది. టీమిండియా స్క్వౌడ్‌ను బట్టి చూస్తే మంచి టీమ్‌ కాంబినేషన్‌ సెట్‌ చేస్తే, దుబాయ్‌ పిచ్‌ను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.