T20 World Cup 2024: సూపర్-8లో భారత్ ఆడేది ఈ టీమ్స్‌తోనే.. ఆ రెండు జట్లతో యమ డేంజర్

ఈ హ్యాట్రిక్ విజయాలతో టీమ్ ఇండియా సూపర్ 8కి చేరుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత సూపర్ 8కి చేరిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పుడు రానున్న మ్యాచ్‌ల్లో మిగిలిన 5 బెర్తుల కోసం మొత్తం 4 గ్రూపుల జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. టీమ్ ఇండియా సూపర్ 8లోకి ప్రవేశించడంతో ఈ రౌండ్‌లో మ్యాచ్ లు కూడా దాదాపు ఖరారయ్యాయి

T20 World Cup 2024: సూపర్-8లో భారత్ ఆడేది ఈ టీమ్స్‌తోనే.. ఆ రెండు జట్లతో యమ డేంజర్
Team India

Updated on: Jun 13, 2024 | 4:35 PM

భారత క్రికెట్ జట్టు బుధవారం(జూన్ 12) ఆతిథ్య జట్టు USAని 7 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 50, శివమ్ దూబే 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నాలుగు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ హ్యాట్రిక్ విజయాలతో టీమ్ ఇండియా సూపర్ 8కి చేరుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత సూపర్ 8కి చేరిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పుడు రానున్న మ్యాచ్‌ల్లో మిగిలిన 5 బెర్తుల కోసం మొత్తం 4 గ్రూపుల జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. టీమ్ ఇండియా సూపర్ 8లోకి ప్రవేశించడంతో ఈ రౌండ్‌లో మ్యాచ్ లు కూడా దాదాపు ఖరారయ్యాయి. టీమ్ ఇండియా సూపర్ 8 స్టేజ్ లో పటిష్ఠమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది.

టీమ్ ఇండియా జూన్ 15న కెనడాతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా సూపర్ 8 రౌండ్‌ను ప్రారంభించనుంది. సూపర్ 8లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. జూన్ 24న సెయింట్ లూసియాలోని డారెన్ స్యామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూపర్ 8లో ఆసీస్ తో సహా టీమిండియా మొత్తం మూడు మ్యాచ్ లు ఆడనుంది. ఆసీస్ కన్నా ముందే జూన్‌ 20న ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. గ్రూప్‌-సి నుంచి ఇప్పటికే వెస్టిండీస్‌ సూపర్‌ 8కు క్వాలిఫై అయిపోయింది. రెండో టీమ్‌గా ఆఫ్ఘనిస్థాన్‌ ఉండే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. ఇక జూన్‌ 22న గ్రూప్‌-డీలో రెండో స్థానంలో నిలిచే టీమ్‌తో టీమిండియా మ్యాచ్‌ ఆడనుంది. గ్రూప్‌-డీ నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సూపర్ -8 కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండు టీమ్స్‌లో ఏదో ఒక టీమ్‌తో టీమిండియా తమ రెండో సూపర్‌ 8 మ్యాచ్‌ను ఆడనుంది.

ఇవి కూడా చదవండి

అంటే సూపర్- 8 స్టేజ్ లో భారత్ కు గట్టిపోటీనే ఎదురుకానుంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ జట్లు టీ20ల్లో ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఈ సూపర్‌ 8 మ్యాచ్‌లన్ని వెస్టిండీస్‌లోనే నిర్వహించనున్నారు. అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి టీమిండియా మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఈ స్టేజ్ లో కనీసం రెండు మ్యాచ్ లు గెలిసినా టీమిండియా సెమీస్ చేరినట్లే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..