AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: భారత్ విజయానికి అదీ ఒక కారణమే.. సౌతాఫ్రికా పుంజుకుంటుంది..

సెంచూరియన్‌లో భారత్ విజయానికి గల కారణాల్లో "సమిష్టి అనుభవం" ఒకటని లెజెండరీ దక్షిణాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా చెప్పాడు...

IND vs SA: భారత్ విజయానికి అదీ ఒక కారణమే.. సౌతాఫ్రికా పుంజుకుంటుంది..
Amla
Srinivas Chekkilla
|

Updated on: Jan 01, 2022 | 8:22 PM

Share

సెంచూరియన్‌లో భారత్ విజయానికి గల కారణాల్లో “సమిష్టి అనుభవం” ఒకటని లెజెండరీ దక్షిణాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా చెప్పాడు. సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇది సరైన ఫలితం అని క్రికెట్ సౌతాఫ్రికా వెబ్‌సైట్‌లో ఆమ్లా పేర్కొన్నాడు. “గత రెండు సంవత్సరాలుగా ఇండియా ఒక బలమైన జట్టుగా ఉంది. వారికి సమిష్టిగా ఎక్కువ అనుభవం ఉంది.” దక్షిణాఫ్రికా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేరు. కెప్టెన్ డీన్ ఎల్గర్, క్వింటన్ డి కాక్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి సాంప్రదాయ ఫార్మాట్‌లో కొంత మంచి ప్రదర్శనను కలిగి ఉన్నారు. అయితే భారతదేశం లైనప్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం లభించడం మ్యాచ్ ఫలితాన్ని మార్చిందని ఆమ్లా అన్నాడు. “సెంచూరియన్ రోజులు గడుస్తున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం మరింత కష్టంగా మారింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి 300 కంటే ఎక్కువ స్కోరు చేసింది. సఫారీ బ్యాటర్లు తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యారు.” అని ఆమ్లా చెప్పాడు. 124 టెస్టుల్లో 28 సెంచరీలతో 46.64 సగటుతో 9,282 పరుగులు చేసిన 38 ఏళ్ల ఆమ్లా, టెస్ట్ తొలి రోజున భారత బ్యాటర్లు తమ టాప్ క్లాస్ ప్రదర్శనను ప్రశంసించారు. “మొదటి రోజు పిచ్ బ్యాటింగ్‌కు ఉత్తమంగా కనిపించింది. క్రమశిక్షణతో కూడిన క్రికెట్ ఆడినందుకు భారతీయులకు క్రెడిట్ దక్కుతుంది” అని అతను చెప్పాడు.

కఠినమైన ప్రారంభ రోజు తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్లు బాగా పోరాడారని ఆమ్లా భావించాడు. “రెండో రోజు ఇండియాను 327 పరుగులకు పరిమితం చేయడంలో బౌలర్లు సక్సెస్ అయ్యారు. లుంగీ ఎన్‌గిడి, కగిసో రబడా, యువకుడు మార్కో జాన్‌సెన్ ప్రత్యేకంగా నిలిచారు. దక్షిణాఫ్రికాకు చేయాల్సిన పని ఉందని ఆమ్లా అంగీకరించాడు. అయినప్పటికీ జట్టు తిరిగి పుంజుకోగలదని” అమ్ల అన్నాడు.

Read Also..  Virat Kohli: కోహ్లీ పేరు పక్కన C(కెప్టెన్) లేకపోవడం ఇబ్బందిగా ఉంది.. మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు..