IND vs SA 2nd Test: జోహన్నెస్‌బర్గ్‌లో టీమిండియాదే ఆధిపత్యం.. మరోసారి 2006 నాటి చరిష్మా పునరావృతం అయ్యేనా?

IND vs SA: జోహన్నెస్‌బర్గ్‌లో టీమ్ ఇండియా రికార్డు బాగుంది. ఇక్కడ ఇప్పటివరకు 5 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో రెండు మ్యాచ్‌లు గెలిచి మూడు డ్రా అయ్యాయి.

IND vs SA 2nd Test: జోహన్నెస్‌బర్గ్‌లో టీమిండియాదే ఆధిపత్యం.. మరోసారి 2006 నాటి చరిష్మా పునరావృతం అయ్యేనా?
Ind Vs Sa Records3
Follow us
Venkata Chari

| Edited By: Phani CH

Updated on: Jan 03, 2022 | 6:54 AM

India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ జనవరి 3 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభం కానుంది. అంతకుముందు సెంచూరియన్‌లో విజయంతో టీమిండియా ఆటగాళ్లు రెచ్చిపోయారు. కానీ, జోహన్నెస్‌బర్గ్‌లో అలాంటి ప్రదర్శనను కొనసాగించడం కోహ్లీసేనకు సవాలుగా మారుతుంది. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లెవరూ ఎక్కువసేపు నిలవలేకపోయారు. జోహన్నెస్‌బర్గ్ గురించి మాట్లాడుతూ, ఇక్కడ టీమ్ ఇండియాకు మంచి రికార్డు ఉంది. 1992 నుంచి ఆడిన 5 మ్యాచ్‌ల్లో భారత్‌ రెండు మ్యాచ్‌లు గెలుపొందగా, మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాపై రెండుసార్లు టీమిండియా ఘన విజంయ సాధించింది. డిసెంబర్ 2006లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో, 15 డిసెంబర్ 2006న ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ఎస్. శ్రీశాంత్ 5 వికెట్లు తీశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రికా జట్టు 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా వెళ్లింది. దీంతో ఈ మైదానంలో భారత్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. జనవరి 24న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తరఫున ఛెతేశ్వర్‌ పుజారా, కోహ్లీ హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. భారత్ తర్వాత ఈ ఆఫ్రికన్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసింది. దీంతో 63 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ది వాండరర్స్ ఆఫ్ జోహన్నెస్‌బర్గ్‌లో కెప్టెన్ కోహ్లీ, టీమ్ ఇండియా ఈ రికార్డును మరోసారి పునరావృతం చేసే సవాలును ఎదుర్కోనున్నారు. టీమ్ ఇండియాకు ఇది పెద్ద అంశం అయినప్పటికీ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. గతంలో కూడా పుజారా, కోహ్లీ వాండరర్స్‌లో ఆడారు. దీని వల్ల టీమ్ కచ్చితంగా లాభపడుతుంది.

Also Read: IND vs SA: భారత్ విజయానికి అదీ ఒక కారణమే.. సౌతాఫ్రికా పుంజుకుంటుంది..

Virat Kohli: సెలక్షన్ కమిటీ నిర్ణయంలో తప్పు లేదు.. కేఎల్ రాహుల్‎ను కెప్టెన్ చేయడం సరైందే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!