Virat Kohli: సెలక్షన్ కమిటీ నిర్ణయంలో తప్పు లేదు.. కేఎల్ రాహుల్‌ను కెప్టెన్ చేయడం సరైందే..
కెప్టెన్సీ వివాదం తర్వాత సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికాపై 113 పరుగులతో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది...
కెప్టెన్సీ వివాదం తర్వాత సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికాపై 113 పరుగులతో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు జట్టు ప్రశంసలు జల్లు కురిసింది. ఒక రోజు తర్వాత, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ 18 మందితో కూడిన భారత వన్డే జట్టును ప్రకటించడం మరోసారి కెప్టెన్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా, బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జట్టులో కోహ్లీ ఉన్నప్పటికీ, భారత సెలక్షన్ కమిటీ కేఎల్ రాహుల్‌పై విశ్వాసం ఉంచింది.
దీనిపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సెలక్షన్ కమిటీ నిర్ణయంలో తప్పేమీ కనిపించలేదన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి విధానాన్ని బట్ ప్రశంసించారు. “విరాట్ కోహ్లీ ఈ జట్టుకు ఇకపై నాయకత్వం వహించడు. అతను ఇకపై జట్టుకు కెప్టెన్‌గా ఉండనందున, వారు (మేనేజ్‌మెంట్) వైస్ కెప్టెన్‌ను స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారు. ఎవరు భవిష్యత్తులో జట్టును నడిపించగలరో బీసీసీఐకి తెలుసని. ఐపీఎల్‌లో రాహుల్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు” అని పాక్ మాజీ ఓపెనర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
టీం ఇండియా యువకులను కెప్టెన్సీ కోసం తీర్చిదిద్దే పద్ధతినే అనుసరిస్తోందని బట్ పేర్కొన్నాడు. “భారత క్రికెట్‌లో ఇది అనుసరిస్తున్న నమూనా. అవకాశం దొరికినప్పుడల్లా, వారు యువకులను పరీక్షిస్తారు. కాబట్టి, KL రాహుల్‌కి ఇది మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను” అని అతను చెప్పాడు. “ఎంఎస్ ధోనీ కాలంలో కూడా మేము దీనిని చూశాం. భారతదేశం చిన్న దేశాలతో తలపడినప్పుడల్లా, అతను యువకులకు కెప్టెన్సీని అప్పగించేవాడు.” అని వివరించాడు. రాహుల్‌కి కెప్టెన్సీని అప్పగించడమే కాకుండా, దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు సీమ్-బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా చేయాలని భారత సెలెక్టర్లు నిర్ణయించారు.
Read Also.. Virat Kohli: కోహ్లీ పేరు పక్కన C(కెప్టెన్) లేకపోవడం ఇబ్బందిగా ఉంది.. మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు..