Virat Kohli: కోహ్లీ పేరు పక్కన C(కెప్టెన్) లేకపోవడం ఇబ్బందిగా ఉంది.. మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‎లో ODI సిరీస్ కోసం 18 మంది సభ్యులతో భారత జట్టును శుక్రవారం ప్రకటించింది...

Virat Kohli: కోహ్లీ పేరు పక్కన C(కెప్టెన్) లేకపోవడం ఇబ్బందిగా ఉంది.. మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు..
Virat
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 01, 2022 | 7:06 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‎లో ODI సిరీస్ కోసం 18 మంది సభ్యులతో భారత జట్టును శుక్రవారం ప్రకటించింది. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోకపోవటంతో అతడి స్థానంలో KL రాహుల్ కెప్టెన్‎గా ఎంపిక చేశారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ, జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జట్టు ఎంపికపై భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. భారత జట్టులో కోహ్లీ పేరు పక్కన “సి” (కెప్టెన్) లేకపోవడం తనకు “నిజంగా ఇబ్బందిగా” అనిపించిందని చోప్రా అన్నాడు.

“విరాట్ కోహ్లి పేరు తర్వాత ‘సి’ లేదు. అది నిజంగా ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే కొన్నేళ్లుగా అది జరగడం లేదు” అని తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో చెప్పాడు. “ఇటీవల టీ20 సిరీస్‌లో మేము చూశాము. కోహ్లీ ఆటను వీడడానికి కొంత సమయం పడుతుంది. కానీ విరాట్ ఇప్పుడు కెప్టెన్ కాదు” అని చెప్పాడు. ఈ ఏడాది ప్రారంభంలో UAEలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. వరల్డ్ కప్ ముందే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పిన కోహ్లీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‎గా ఎంపిక చేశారు. ఆ తర్వాత కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించారు.

Read Also.. IND vs SA: వాండరర్స్‌లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. వైరల్‎ అయిన వీడియో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!