T20 World Cup: ‘టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే టీమిండియా ఇదే.. స్వ్కాడ్ నుంచి ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్’
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టుపై నిరంతరం ఊహాగానాలు జరుగుతున్నాయని తెలిసిందే. ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరు ఎంపిక చేయరంటూ రోజుకో కొత్త వార్తలు వస్తున్నాయి. ఐపిఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా, పరిస్థితి చాలా వరకు స్పష్టమైంది. జట్టులో స్థానం నిర్ధారించబడిన కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. కొంతమంది ఆటగాళ్లపై ఇంకా సందేహాలు ఉన్నాయి.

Indian Team for T20 World Cup: ఇర్ఫాన్ పఠాన్ రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు. అతను తన జట్టులో చాలా మంది దిగ్గజ క్రికెటర్లకు చోటు కల్పించాడు. అయితే కొంతమంది ఆటగాళ్లకు మార్గం చూపించాడు. ఈ లిస్టులో సంజూ శాంసన్, కేఎల్ రాహుల్‌కు మొండిచేయి చూపించాడు. వీరిని ఇర్ఫాన్ పఠాన్ తన T20 ప్రపంచ కప్ జట్టులో చేర్చులేదు.
ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా, ఇర్ఫాన్ పఠాన్ తన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఐపీఎల్‌కు ముందు కూడా యశస్వి జైస్వాల్ భారత జట్టు తరపున రాణిస్తున్నాడని, అందుకే అతని ఎంపిక అవసరమని చెప్పాడు. అదే సమయంలో, అతను విరాట్ కోహ్లీని మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి ఉంచాడు. ఇర్ఫాన్ పఠాన్ తన జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో స్థానంలో, రిషబ్ పంత్‌ను ఐదవ స్థానంలో ఎంచుకున్నాడు.
దీంతో పాటు రింకూ సింగ్‌ను కూడా ఇర్ఫాన్ పఠాన్ ఎంపిక చేసుకున్నాడు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఎంపికయ్యారు. ఇర్ఫాన్ పఠాన్ తన జట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేసుకున్నాడు. రవీంద్ర జడేజాతో పాటు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేశాడు. చాహల్, కుల్దీప్ ఇద్దరూ ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేశారు. ఇర్ఫాన్ పఠాన్ ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎంపిక చేశాడు. కాగా బ్యాకప్ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ కూడా ఎంపికయ్యాడు.
ఇర్ఫాన్ పఠాన్ టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు..
Irfan Pathan’s T20 World Cup squad of India. (Star Sports). pic.twitter.com/QNa0b2WMSt
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సింగ్ సిరాజ్, అర్ష్‌దీప్ జిరాజ్.
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టుపై నిరంతరం ఊహాగానాలు జరుగుతున్నాయని తెలిసిందే. ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరు ఎంపిక చేయరంటూ రోజుకో కొత్త వార్తలు వస్తున్నాయి. ఐపిఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా, పరిస్థితి చాలా వరకు స్పష్టమైంది. జట్టులో స్థానం నిర్ధారించబడిన కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. కొంతమంది ఆటగాళ్లపై ఇంకా సందేహాలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




