Asia Cup 2023: ప్రపంచ కప్‌నకు ముందు 3సార్లు ఢీ.. ఇక ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్సే.. దాయాదుల పోరుపై పూర్తి వివరాలు మీకోసం..
Asia Cup 2023, IND vs PAK: ఆసియా కప్ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అయితే నివేదికలను విశ్వసిస్తే ఆగస్టు 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. అదే సమయంలో ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరుగుతుంది. ఆతిథ్య పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో ఆసియా కప్ జరుగుతుంది.
Asia Cup 2023, IND vs PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ని చూడటానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే అంతకంటే ముందు ఆసియా కప్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్‌లో భారత్-పాక్‌ల మధ్య ఒకటి కాదు మొత్తం మూడు మ్యాచ్‌లు చూడొచ్చు.
ఆసియా కప్ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అయితే నివేదికలను విశ్వసిస్తే ఆగస్టు 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. అదే సమయంలో ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరుగుతుంది. ఆతిథ్య పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో ఆసియా కప్ జరుగుతుంది. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనుండగా, ఫైనల్‌తో సహా మిగిలిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. నివేదికల ప్రకారం, ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య లీగ్ దశ మ్యాచ్ సెప్టెంబర్ 3న జరగనుంది.
‘ఇన్‌సైడ్‌స్పోర్ట్’తో మాట్లాడుతూ, బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, “చివరి నిమిషంలో కొన్ని మార్పులు వచ్చాయి. తాత్కాలిక షెడ్యూల్ సభ్యుల అభిప్రాయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ వారంలోగా షెడ్యూల్ రావొచ్చు. వర్షాకాలం కారణంగా కొలంబో సమస్యగా ఉంది. కొలంబోలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. కానీ, వర్షం సమస్య కావచ్చు’ అని అన్నాడు.
ఆసియాకప్‌లో భారత్-పాక్ మూడు మ్యాచ్‌లు..
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మొత్తం మూడు మ్యాచ్‌లు చూడొచ్చు. ఈసారి ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. ఇంతకుముందు టీ20 ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మొత్తం రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈసారి మూడు మ్యాచ్‌లు ఉండవచ్చని తెలుస్తోంది. తొలిది లీగ్ మ్యాచ్. సూపర్-4 దశలో ఇరు జట్లు తలపడతాయి. అదే సమయంలో సూపర్-4 తర్వాత ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య ఢీకొనవచ్చని తెలుస్తోంది.
విశేషమేమిటంటే, ఆసియా కప్ 2023లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లను ఇందులో చేర్చనున్నారు. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..