Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: రెండో టీ20లో విజయం.. పాకిస్తాన్‌, ఆస్ట్రేలియాలకు ఇచ్చిపడేసిన భారత యువసేన..

IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైన జింబాబ్వేను భారత బౌలర్లు 134 పరుగులకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి బౌలర్లపై టీమిండియా బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయి బ్యాట్ ఝులిపించారు. ఈ విజయంతో పాకిస్థాన్, ఆస్ట్రేలియా రికార్డులను టీమిండియా బ్రేక్ చేసింది.

IND vs ZIM: రెండో టీ20లో విజయం.. పాకిస్తాన్‌, ఆస్ట్రేలియాలకు ఇచ్చిపడేసిన భారత యువసేన..
Abhishek Sharma
Venkata Chari
|

Updated on: Jul 08, 2024 | 5:10 PM

Share

IND vs ZIM: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైన జింబాబ్వేను భారత బౌలర్లు 134 పరుగులకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి బౌలర్లపై టీమిండియా బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయి బ్యాట్ ఝులిపించారు. ఈ విజయంతో పాకిస్థాన్, ఆస్ట్రేలియా రికార్డులను టీమిండియా బ్రేక్ చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిచిన దేశంగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఉన్నాయి.

పాకిస్థాన్ రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా..

జింబాబ్వేతో జరుగుతున్న టీ20ఐ సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్స్ తన నిర్ణయం సరైనదని నిరూపించారు. భారత్ 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈ సమయంలో అభిషేక్ శర్మ 100 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 77 పరుగులు, రింకూ సింగ్ 48 పరుగులు చేశారు. దీంతో జింబాబ్వే ఇన్నింగ్స్ 134 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20లో భారత జట్టు 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయం సాధించడం ఇది ఐదోసారి. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా తలో 4 సార్లు భారీ తేడాతో మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. కాగా, ఇంగ్లండ్‌, అఫ్గానిస్థాన్‌ ఈ తరహాలో తలో 3 సార్లు గెలిచాయి.

T20Iలో 100+ పరుగులతో అత్యధిక విజయాలు సాధించిన జట్లు..

టీమిండియా – 5 విజయాలు

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ – 4 విజయాలు

ఆస్ట్రేలియా – 4 విజయాలు

ఇంగ్లండ్ – 3 విజయాలు

ఆఫ్ఘనిస్తాన్ – 3 విజయాలు

ఈ జింబాబ్వే పర్యటనలో భారత జట్టు 5 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలి 2 మ్యాచ్‌ల తర్వాత ఈ సిరీస్‌ 1-1తో సమమైంది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య తదుపరి మ్యాచ్ జులై 10న జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..