IND vs ZIM: జింబాబ్వే పర్యటనకు భారత జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది టీమిండియా. స్వదేశంలో జరుగుతోన్న ఈ సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్‌లోని మూడో మ్యాచ్ ఫిబ్రవరి 25 నుంచి 29 వరకు రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమ్ ఇండియా నేరుగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. ఈ టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్, అమెరికాలో నిర్వహించనున్నారు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది టీమిండియా. స్వదేశంలో జరుగుతోన్న ఈ సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్‌లోని మూడో మ్యాచ్ ఫిబ్రవరి 25 నుంచి 29 వరకు రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ సిరీస్ తర్వాత టీమ్ ఇండియా నేరుగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. ఈ టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్, అమెరికాలో నిర్వహించనున్నారు. అయితే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. జింబాబ్వే, టీమిండియాల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జింబాబ్వే క్రికెట్ ట్వీట్ చేసింది. ఈ టీ20 సిరీస్‌ను జూలై నెలలో నిర్వహించనున్నారు. సిరీస్‌లోని మొత్తం ఐదు మ్యాచ్‌లు హరారే క్రికెట్ క్లబ్ స్టేడియంలో జరుగుతాయని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టీం ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య ఇప్పటి వరకు మొత్తం 3 టీ20 సిరీస్‌లు జరిగాయి. టీం ఇండియా 2 సిరీస్‌లను కైవసం చేసుకుంది. మరో సిరీస్ సమమైంది. ఇరు జట్ల మధ్య తొలి సిరీస్ 2010లో జరిగింది. 2 మ్యాచ్‌ల సిరీస్‌ని 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2015లో 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 2016లో ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఇరు జట్ల మధ్య ఇది నాలుగో టీ20 సిరీస్ కానుంది.
టీం ఇండియా వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్
- మొదటి మ్యాచ్, జూలై 6
- రెండవ మ్యాచ్, జూలై 7
- మూడో మ్యాచ్, జూలై 10
- నాలుగో మ్యాచ్, జూలై 13
- ఐదవ మ్యాచ్, జూలై 14
మ్యాచ్‌లన్నీ హరారే క్రికెట్ క్లబ్ స్టేడియంలో జరగనున్నాయి.
‘‘జూలైలో టీమ్ ఇండియాతో జరిగే టీ20 సిరీస్ కోసం ఎదురుచూస్తున్నాం. టీమ్ ఇండియా తో క్రికెట్ మ్యాచ్‌ల వల్ల మేం బాగా పుంజుకున్నాం. ఇందుకుగానూ మేము బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తవెంగ్వా ముకుహ్లానీ బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపారు.
టీ20 ప్రపంచకప్ తర్వాత ..
JUST IN: Zimbabwe to host India for T20I series
Details 🔽https://t.co/kqSK4dcolC pic.twitter.com/xnN6N6ReL2
— Zimbabwe Cricket (@ZimCricketv) February 6, 2024
Here is the full schedule of the India tour of Zimbabwe 2024⬇️
For more stories and videos, visit the Sports Tak website⬇️ https://t.co/H5XWuscXHH@BCCI @ZimCricketv#TeamIndia #ZimbabweCricket #INDvsZIM #T20I #SportsTak pic.twitter.com/InMGF22MON
— Sports Tak (@sports_tak) February 6, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..




