IND vs WI: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టీ20 సీరిస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్..
Team India: కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ రూపంలో టీమిండియా ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికే ఈ సిరీస్‌కు దూరమవగా, ప్రస్తుతం టీమిండియాకు మూడోసారి ఎదురుదెబ్బ తగిలింది.
ఫిబ్రవరి 16న భారత్, వెస్టిండీస్(IND vs WI) మధ్య ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా(Team India)కు బ్యాడ్ న్యూస్. భారత జట్టు స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) గాయంతో మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. నివేదిక ప్రకారం, సుందర్ ఇప్పటికే సిరీస్‌కు ముందు గాయపడ్డాడు. ఇకపై సిరీస్‌లో భాగం కాలేడు. సుందర్ కోల్‌కతాలో ఉన్న భారత జట్టు నుంచి విడిపోయాడు. ప్రస్తుతం నేరుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి వెళ్లాడు. అక్కడ అతని గాయంపై డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతోంది. సుందర్ ఇటీవల వన్డే సిరీస్‌లోనే తిరిగి జట్టులోకి వచ్చాడు.
సుందర్ స్నాయువు సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతను సిరీస్‌లో ఆడే అవకాశం లేదని బీసీసీఐ అధికారి పీటీఐతో తెలపారు. ఈ అధికారి మాట్లాడుతూ, “వాషింగ్టన్‌కు స్నాయువు గాయంతో బాధపడుతున్నాడు. దాని కారణంగా అతను ఈ రోజు (సోమవారం 14 ఫిబ్రవరి) ప్రాక్టీస్ చేయలేకపోయాడు. 5 రోజుల్లో 3 మ్యాచ్‌లు జరగనున్నందున అతను మొత్తం టీ20 సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది” అని తెలిపారు.
చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి.. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనే భారత ఆల్‌రౌండర్ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన అతడు టెస్టు సిరీస్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఐపీఎల్ 2021, టీ20 ప్రపంచకప్ కూడా ఆడలేకపోయాడు. సుందర్ దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ మ్యాచులకు ముందు, అతను కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడు. దీంతో జట్టులోకి రాలేకపోయాడు.
చాహల్‌పై టీం ఇండియా ఆధారపడుతోంది.. టీ20 సిరీస్‌కు అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌గా, ప్రస్తుతం టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రమే ఉన్నాడు. జట్టులో రవి బిష్ణోయ్ కూడా ఉన్నప్పటికీ, హర్‌ప్రీత్ బ్రార్ కూడా స్టాండ్‌బైగా జట్టుతో కోల్‌కతా చేరుకున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుందర్ స్థానంలో ఎవరిని బరిలోకి దించుతారో చూడాలి.
NCAలో సుందర్.. సుందర్ ప్రస్తుతం నేరుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. అక్కడే తన గాయాన్ని తగ్గించుకునేందుకు పనిచేస్తుంటాడు. సుందర్‌కు మద్దతుగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. రాహుల్, అక్షర్ కూడా టీ20 సిరీస్‌లో భాగంగా ఉన్నారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఇద్దరని చేర్చుకోలేదు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ స్నాయువు గాయంతో బాధపడ్డాడు. దాని కారణంగా అతను మూడో ODIలో ఆడలేకపోయాడు. అదే సమయంలో, ODI సిరీస్‌కు ముందే అక్షర్ పటేల్ కరోనా బారిన పడ్డాడు.
? NEWS ?: Washington Sundar ruled out of @Paytm #INDvWI T20I series.
The #TeamIndia all-rounder suffered a left hamstring muscle strain during fielding in the third ODI against the West Indies played at the Narendra Modi Stadium on Friday.
More Details ?
— BCCI (@BCCI) February 14, 2022
Also Read: IPL 2022:14 కోట్ల కంటే తక్కువైనా పర్వాలేదు.. కానీ అదే జట్టుకి ఆడాలని అనుకున్నా..?