AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ఫలించిన ప్రయోగాలు.. మూడో వన్డేలో భారత్ భారీ విజయం.. విండీస్‌పై వరుసగా 13వ సిరీస్ కైవసం..

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్‌ గడ్డపై భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. 2022లో వెస్టిండీస్‌ను వారి సొంత మైదానంలో 119 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. భారత జట్టు 2–1తో కరీబియన్లను ఓడించింది. వెస్టిండీస్‌పై భారత్‌ వరుసగా 13వ సిరీస్‌ను కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

IND vs WI: ఫలించిన ప్రయోగాలు.. మూడో వన్డేలో భారత్ భారీ విజయం.. విండీస్‌పై వరుసగా 13వ సిరీస్ కైవసం..
Wi Vs Ind Odi Series
Venkata Chari
|

Updated on: Aug 02, 2023 | 3:07 AM

Share

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్‌ గడ్డపై భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. 2022లో వెస్టిండీస్‌ను వారి సొంత మైదానంలో 119 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. భారత జట్టు 2–1తో కరీబియన్లను ఓడించింది. వెస్టిండీస్‌పై భారత్‌ వరుసగా 13వ సిరీస్‌ను కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ జట్టు 35.3 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది.

ముఖేష్ కుమార్ వరుసగా మూడు వికెట్లు తీశాడు. అతను 5 పరుగుల వద్ద షాయ్ హోప్, 4 పరుగుల వద్ద కైల్ మేయర్స్, జీరోకే బ్రాండన్ కింగ్‌లను అవుట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

దంచికొట్టిన భారత ఆటగాళ్లు..

భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా 70, శుభగన్ గిల్ 85, ఇషాన్ కిషన్ 77, సంజూ శాంసన్ 51 పరుగులతో అర్ధసెంచరీలు ఆడారు. సూర్యకుమార్ యాదవ్ 35 పరుగులు చేశాడు.

వెస్టిండీస్‌ తరపున రొమారియో షెపర్డ్‌ రెండు వికెట్లు తీశాడు. అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోతీ, యానిక్ కరియాలకు ఒక్కో వికెట్ దక్కింది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్: హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్, రీతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అతానాజ్, షాయ్ హోప్ (కెప్టెన్ & కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కేసీ కార్తీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోట్టి, జాడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us