AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: టెస్టు జట్టులోకి నయా సెహ్వాగ్ ఆయేగా.. దిగ్గజ బౌలర్‌కైనా దడపుట్టాల్సిందే.. టీమిండియా ఫ్యూచర్ స్టార్?

IND vs WI, 2nd Test News: టీ20 లాంటి బ్యాటింగ్‌తో దడ పుట్టించే ప్లేయర్.. టీమిండియా టెస్ట్ టీమ్‌కి దొరికాడు. ఈ బ్యాట్స్‌మెన్ తన తుఫాను బ్యాటింగ్‌తో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తుకు తెచ్చాడు.

IND vs WI: టెస్టు జట్టులోకి నయా సెహ్వాగ్ ఆయేగా.. దిగ్గజ బౌలర్‌కైనా దడపుట్టాల్సిందే.. టీమిండియా ఫ్యూచర్ స్టార్?
Ind Vs Wi 2nd Test
Venkata Chari
|

Updated on: Jul 24, 2023 | 4:08 PM

Share

IND vs WI, 2nd Test: టీ20 లాంటి బ్యాటింగ్‌తో దడ పుట్టించే ప్లేయర్.. టీమిండియా టెస్ట్ టీమ్‌కి దొరికాడు. ఈ బ్యాట్స్‌మెన్ తన తుఫాను బ్యాటింగ్‌తో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తుకు తెచ్చాడు. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా సాగుతుందని భావించినా.. మహమ్మద్‌ సిరాజ్‌ (60 పరుగులకు 5 వికెట్లు) డేంజరస్ బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కట్టడి చేశారు.

టెస్టు జట్టుకు టీ20 బ్యాటర్..

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్ట్ నాలుగో రోజున భారత్ రెండు వికెట్ల నష్టానికి 181 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని అందించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 57 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 52 పరుగులు చేశాడు. అంతకుముందు, భారత్ 438 పరుగులకు సమాధానంగా, వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 183ల ఆధిక్యంలో నిలిచింది. ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ కారణంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. ఇషాన్ కిషన్ టెస్టు మ్యాచ్‌లో టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

సెహ్వాగ్ తుఫాను బ్యాటింగ్‌ను గుర్తు చేసిన ఇషాన్..

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 52 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని ఇషాన్ కిషన్ గుర్తు చేశాడు. వెస్టిండీస్‌పై ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. BCCI టెస్ట్ జట్టు కోసం ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ కోసం వెతుకుతోంది. అది ఇప్పుడు పూర్తయింది. ఇషాన్‌ కిషన్‌ ఫాస్ట్‌ బ్యాటింగ్‌‌కు ప్రత్యేకతగాంచాడు. ఈ ఆటగాడు క్రీజులోకి రాగానే దిగ్గజ బౌలర్లకు కూడా ముచ్చెమటలు పట్టిస్తుంటాడు.

ఇవి కూడా చదవండి

ప్రత్యర్థి జట్టుకు దడ పుట్టించే సామర్థ్యం..

ఇషాన్ కిషన్ కొన్ని బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చేస్తాడు. ఇషాన్ కిషన్ IPL 2023లో అద్భుతమైన ఆట నమూనాను అందించాడు. ఇషాన్ కిషన్ తన వేగవంతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇషాన్ కిషన్‌కు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. భారత్ ఈ ఏడాది ఆసియా కప్ 2023, ప్రపంచకప్ 2023 వంటి పెద్ద టోర్నీలు ఆడాల్సి ఉంది. ఇషాన్ కిషన్ భారత తదుపరి స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కావచ్చు. ఇషాన్ కిషన్ సొంతంగా ప్రత్యర్థి జట్టును చిత్తు చేయగల సత్తా ఉంది. ఇషాన్ కిషన్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, అలాంటి బ్యాట్స్‌మెన్ ఏ జట్టుకైనా అతిపెద్ద X కారకంగా నిరూపణవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..