AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 10 ఏళ్లలో 13 పరాజయాలు.. దడ పుట్టిస్తోన్న టీమిండియా నాకౌట్ బలహీనత.. ఈసారైనా మారేనా?

ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఫైనల్లో పాక్ ఏకపక్షంగా 128 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ ఓటమితో మరోసారి నాకౌట్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమిండియా బలహీనత తెరపైకి వచ్చింది.

Team India: 10 ఏళ్లలో 13 పరాజయాలు.. దడ పుట్టిస్తోన్న టీమిండియా నాకౌట్ బలహీనత.. ఈసారైనా మారేనా?
Team India (4)
Venkata Chari
|

Updated on: Jul 24, 2023 | 3:43 PM

Share

ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ ఫైనల్‌లో టీమిండియా -పాకిస్థాన్ మధ్య జరిగిన టైటిల్ మ్యాచ్ కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలకు నిరాశ కలిగించింది. ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత జట్టు 128 పరుగుల భారీ తేడాతో పాక్ చేతిలో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 352 పరుగులు చేయగా, భారత జట్టు కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. టీమ్ ఇండియా ఈ ఓటమి తర్వాత మరోసారి ఆ ప్రశ్న తలెత్తింది. దీనికి సమాధానం గత 10 సంవత్సరాలుగా దొరకడం లేదు. నాకౌట్‌లో టీమిండియా ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతుందనేది ప్రశ్నగా మారింది. టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసే జట్టు డూ ఆర్ డై మ్యాచ్‌లలో ఎందుకు విఫలమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే పని తెలుసుకుందాం..

భారత పురుషుల క్రికెట్ గురించి మాట్లాడితే.. భారత సీనియర్ పురుషుల జట్టు అయినా, అండర్-19 జట్టు అయినా లేదా ఎమర్జింగ్ టీం అయినా, గత 10 ఏళ్లలో టైటిల్ గెలుచుకునే మొత్తం 13 అవకాశాలను కోల్పోయింది. ఈ మూడు భారత జట్లు ఫైనల్ లేదా సెమీ-ఫైనల్ మ్యాచ్‌లలో మొత్తం 13 సార్లు ఓడిపోయాయి. గత 10 ఏళ్లలో భారత పురుషుల జట్టు ఏ టోర్నీల్లో ఓడిపోయిందో ఇప్పుడు చూద్దాం..

తాజా ఓటమితో ‘హ్యాట్రిక్’..

ఇప్పుడు నాకౌట్‌లో ఓటమి గురించి చర్చ జరుగుతోంది. కాబట్టి, మొదట ఎమర్జింగ్ టీమ్ గురించి మాట్లాడుకుందాం. భారత వర్ధమాన జట్టు 2013లో తొలిసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత యువ భారత రేసు నుంచి జట్టు నాలుగు సార్లు తప్పుకుంది. వరుసగా మూడుసార్లు నాకౌట్‌లో ఓటమి పాలవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

2018లో ఫైనల్‌లో శ్రీలంక చేతిలో..

2019లో జరిగిన సెమీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ చేతిలో..

2023లో మళ్లీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.

సీనియర్ జట్టు 10 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీకి దూరంగా..

నాకౌట్ మ్యాచ్‌ల్లో ఉక్కిరిబిక్కిరి అయ్యే ఈ జబ్బు సీనియర్ జట్టు నుంచే మొదలైంది. భారత క్రికెట్ జట్టు 2013 సంవత్సరంలో చివరిసారిగా ICC ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి 9 సార్లు ఫైనల్ లేదా సెమీ-ఫైనల్‌లో ఓడిపోతూనే ఉంది.

2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి.

2015లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది.

2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది.

2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓడిపోయింది.

2019లో మరోసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఓడింది.

2021లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయింది.

2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది.

2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి.

అండర్-19 జట్టు కూడా 2 ఫైనల్స్‌లో ఓటమిపాలు..

ఇప్పటికీ అండర్-19 జట్టు ప్రదర్శన గత 10 ఏళ్లలో కాస్త మెరుగ్గా ఉంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఐదు ఫైనల్స్‌కు గానూ 2 ఫైనల్స్‌లో టీమిండియా విజయం సాధించింది. అయితే, రెండుసార్లు ఫైనల్స్‌లో ఓడిపోయింది.

2016 ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది.

2020 ప్రపంచకప్ ఫైనల్‌లో ఓడిపోయింది.

13 నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమి?

మొత్తం 13 ట్రోఫీలను గెలుచుకోవడంలో టీమిండియా మిస్సయినట్లు స్పష్టమవుతోంది . ఇలా ఎందుకు జరుగుతోంది? అనేది ప్రశ్నగా మారింది. లీగ్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తున్న భారత ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో ఎందుకు విఫలమవుతున్నారు? బీసీసీఐ ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోందా అనే ప్రశ్న కూడా ఉంది. ఇది సమస్యగా పరిగణించబడితే, దాని పరిష్కారానికి ఏమి చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోతే నాకౌట్‌లో విఫలమవుతూనే ఉంటుంటారు. వరల్డ్ కప్ చాలా దగ్గరలో ఉంది. ఈసారి ఈవెంట్ కూడా భారతదేశంలోనే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియాపై అంచనాల ఒత్తిడి ఉంటుంది. మరి ఇప్పుడు టీమిండియా సెమీఫైనల్ లేదా ఫైనల్స్‌కు చేరితే నాకౌట్‌లో కుప్పకూలుతుందా లేదా విజృంభిస్తారా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..