IND vs SL: క్లీన్ స్వీప్ దిశగా రోహిత్ సేన.. శ్రీలంక విజయానికి 419 పరుగులు.. భారత్‌కు 9 వికెట్లు..
బెంగళూరు వేదికగా జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో భారత్ శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది.
శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టు క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. బెంగళూరు టెస్టులో రెండో రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో శ్రీలంక (India vs Sri Lanka) ముందు టీమ్ ఇండియా 447 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(Rishabh Pant) రికార్డు హాఫ్ సెంచరీ, ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) సెకండ్ హాఫ్ సెంచరీ సాయంతో భారత జట్టు శ్రీలంక విజయాన్ని కష్టతరం చేసింది. మరోవైపు భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక పేలవమైన ఆరంభాన్ని అందించగా, రోజు ఆట ముగిసే వరకు 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది.
బెంగుళూరు టెస్టులో ఇంకా 3 రోజులు మిగిలి ఉండగా, టీమిండియా విజయానికి 9 వికెట్లు కావాలి. అదే సమయంలో శ్రీలంక లక్ష్యానికి ఇంకా 419 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆటలో ఇరు జట్లు కలిసి 14 వికెట్లు తీశాయి. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగలు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో రిషబ్ పంత్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక తరపున ప్రవీణ్ జయవిక్రమ 4 వికెట్లు, లసిత్ ఎంబుల్దేనియా 3 వికెట్లు తీశారు.
అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఖాతాలో ఓ వికెట్ చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది.
Also Read: అవాంఛిత రికార్డులో చేరిన శ్రేయాస్ అయ్యర్
Viral Video: అభిమానుల అరుపులకు ఫీల్డ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే.. వైరల్‌గా మారిన వీడియో..