AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking‌ Video: కోహ్లీతో సెల్ఫీ అంటే మామూలుగా ఉండదుగా.. పోలీసులకి చుక్కలు చూపించిన ఫ్యాన్స్‌..

Shocking‌ Video: కరోనా తగ్గుముఖం పట్టడంతో బీసీసీఐ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులకు అనుమతినిచ్చింది. అయితే ఆటగాళ్ళు ఇప్పటికీ బయో-సెక్యూర్ బబుల్‌లోనే ఉంటున్నారు.

Shocking‌ Video: కోహ్లీతో సెల్ఫీ అంటే మామూలుగా ఉండదుగా.. పోలీసులకి చుక్కలు చూపించిన ఫ్యాన్స్‌..
Virat Kohli Fans
uppula Raju
|

Updated on: Mar 14, 2022 | 5:55 AM

Share

Shocking‌ Video: కరోనా తగ్గుముఖం పట్టడంతో బీసీసీఐ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులకు అనుమతినిచ్చింది. అయితే ఆటగాళ్ళు ఇప్పటికీ బయో-సెక్యూర్ బబుల్‌లోనే ఉంటున్నారు. ఇదిలా వుండగా బెంగుళూరులో భారత్- శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా కొంతమంది ప్రేక్షకులు మైదానంలోకి ప్రవేశించారు. ఏకంగా విరాట్ కోహ్లీతో ఫోటోలు దిగడం ప్రారంభించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ముగ్గురు అభిమానులు పోలీసులని మైదానంలో పరుగుపెట్టించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్ రెండో రోజు చివరి నిమిషాల్లో ఈ సంఘటన జరిగింది. విరాట్ కోహ్లీకి చెందిన ముగ్గురు అభిమానులు గ్రౌండ్ భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించారు. కోహ్లీతో సెల్ఫీ దిగడం ప్రారంభించారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది అతన్ని బయటకు పంపించారు. ఆ సమయంలో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. ఆరో ఓవర్‌లో మహ్మద్ షమీ దెబ్బకి కుశాల్ మెండిస్ చికిత్స పొందుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఐపిఎల్ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగమైన విరాట్ కోహ్లీకి చిన్నస్వామి స్టేడియం రెండో సొంత మైదానం. ఇక్కడి అభిమానులతో అతనికి ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే స్టార్ ప్లేయర్‌ను దగ్గరగా చూసే అవకాశం రావడంతో ముగ్గురు అభిమానులు మైదానంలోకి ప్రవేశించి సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. అందులో ఒకరు కోహ్లీని చేరుకున్నాడు. తన మొబైల్ తీసి సెల్ఫీ కోసం అడిగాడు. కోహ్లీ అంగీకరించడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంతలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మైదానంలో ఉన్న ముగ్గురిని పట్టుకోవడానికి పరుగులు తీశారు. కొంత సేపటికి ముగ్గురిని పట్టుకొని బయటికి పంపించారు.

Russia Ukraine War: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..