AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: నేటి నుంచే భారత్-దక్షిణాఫ్రికా టీ20 పోరు.. ఫ్రీగా లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమ్ ఇండియా యువ జట్టు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌కు ముందు భారత జట్టు తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు తొలి మ్యాచ్‌లో ఎవరు శుభారంభం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

IND vs SA: నేటి నుంచే భారత్-దక్షిణాఫ్రికా టీ20 పోరు.. ఫ్రీగా లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?
India Vs South Africa
Basha Shek
|

Updated on: Nov 08, 2024 | 11:12 AM

Share

టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో మొత్తం 4 టీ20ల సిరీస్ ఆడనుంది. భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. ఆతిథ్య జట్టుకు ఐడాన్ మార్క్రామ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్ నవంబర్ 8న రాత్రి 8:30 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. అంతకు ముందు 8 గంటలకు టాస్‌ వేయనున్నారు. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రసారమవుతుంది. అలాగే మొబైల్‌లో Jio సినిమా యాప్ ద్వారా లైవ్ మ్యాచ్ ను వీక్షించవచ్చు. గతంలో టీమిండియా గత ఏడాది దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ భారత కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే 3 మ్యాచ్‌ల సిరీస్‌ని భారత్‌ గెలవలేకపోయింది. సిరీస్‌ 1-1తో సమమైంది. ఒక మ్యాచ్ రద్దు అయ్యింది. ఈ ఏడాది కెప్టెన్‌గా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లడం సూర్యకు ఇది రెండోసారి. కాబట్టి దక్షిణాఫ్రికాలో భారత్‌కు సిరీస్‌ని గెలిపించే బాధ్యత కెప్టెన్ పైనే ఉంది. కెప్టెన్సీతో సహా యువ ఆటగాళ్ల ను సూర్య ఎలా నడిపిస్తాడన్నదానిపై క్రికెట్ అభిమానులు దృష్టి సారించారు.

గత రికార్డులు ఇవే..

కాగా, ఇరు జట్లలో ఇప్పటి వరకు మొత్తం 27 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 27 మ్యాచ్‌ల్లో 15 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 11 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం సంఖ్యాబలం చూస్తుంటే టీమ్ ఇండియా బెటర్ అని అర్థమవుతోంది. అయితే ఈ సిరీస్‌ లో సౌతాఫ్రికాకు హోమ్ పొజిషన్ ప్రయోజనం ఉంటుంది. ఈ సందర్భంలో భారత జట్టు కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.

ఇవి కూడా చదవండి

ట్రోఫీతో కెప్టెన్ల ఫొటోషూట్

టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , అర్ష్దీప్ సింగ్, విజయకుమార్ వైశాఖ్, అవేష్ ఖాన్, యష్ దయాల్.

T20I సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు:

ఐడాన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రెజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిక్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహలాలి సిమ్‌పాంగ్వానా, ర్యాన్ మ్పాంగ్వానా, ర్యాన్ మ్‌పాంగ్వానా, రికెల్ లూథో సిపమాల, ట్రిస్టన్ స్టబ్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..