RCB WPL Retention: ఏడుగురు ప్లేయర్లు ఔట్.. కోహ్లీకి ప్రపోజ్ చేసిన మహిళా క్రికెటర్ ఇన్..

ఐపీఎల్ మాదిరిగానే మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా రాబోయే సీజన్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.

RCB WPL Retention: ఏడుగురు ప్లేయర్లు ఔట్.. కోహ్లీకి ప్రపోజ్ చేసిన మహిళా క్రికెటర్ ఇన్..
Wpl Retention 2025 Rcb Release Retention Player
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 07, 2024 | 7:38 PM

తాజాగా  డిఫెండింగ్ ఛాంపియన్ RCB రిటెన్షన్ లీస్టు విడుదల చేసింది. మినీ వేలానికి ముందు, ఈ ఫ్రాంచైజీ జట్టు 7 మంది ఆటగాళ్లను విడుదల చేసింది.  IPL లాగా WPLలో మెగా వేలం లేదు. బదులుగా మినీ వేలం ఉంటుంది. ఆ విధంగా ఫ్రాంచైజీలు గరిష్ట సంఖ్యలో ఆటగాళ్లను నిలుపుకుంటాయి. జట్టు నుండి చాలా తక్కువ మంది ఆటగాళ్లను తొలగిస్తాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీకి 18 మంది మహిళా ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవడానికి అనుమతి ఉంది. అందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇలా కొద్ది రోజుల క్రితమే ట్రేడింగ్ ద్వారా డానీ వాట్‌ను కొనుగోలు చేసిన ఆర్సీబీ జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య 8కి చేరుకుంది. అందుకే, RCB జట్టు నుండి ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ నాడిన్ డి క్లెర్క్‌లను విడుదల చేసింది.

RCB నుండి తప్పుకున్న ఆటగాళ్లు:

దిశా కసత్, ఇంద్రాణి రాయ్, నాడిన్ డి క్లర్క్, శుభా సతీష్, శ్రద్ధా పోకర్కర్, సిమ్రాన్ బహదూర్,  హీథర్ నైట్

RCB అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీళ్లే:

  1. స్మృతి మంధాన
  2. ఎల్లిస్ పెర్రీ
  3. రిచా ఘోష్
  4. సబ్బినేని మేఘన
  5. రాంకా పాటిల్
  6. జార్జియా వేర్‌హామ్
  7. ఆశా శోభన
  8. రేణుకా సింగ్
  9. సోఫీ డివైన్
  10. సోఫీ మోలినెక్స్
  11. ఏక్తా బిష్త్
  12. కనికా అహుజా
  13. కేట్ క్రాస్
  14. డేనియల్ వ్యాట్

కోహ్లీకి పదేళ్ల క్రితం ఇంగ్లాండ్​ మహిళా క్రికెటర్​ డేనియల్ వ్యాట్ ప్రపోజ్ చేసిన విషయం మనందరీకి తెలిసిందే. ఇటివలే జట్టులోకి ఆర్సీబీ ఆమెను తీసుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి