Video: వేలు చూపిస్తూ భారత ఆటగాడిని రెచ్చగొట్టిన పాక్ బౌలర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్

IND vs PAK: ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత జట్టు విజయంతో అడుగులు వేసింది. చిరకాల ప్రత్యర్థి పాక్ జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో రెండో మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ, పాక్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా స్టార్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ అవుట్ అయిన వెంటనే, పాక్ బౌలర్‌తో గొడవ పడ్డాడు. అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Video: వేలు చూపిస్తూ భారత ఆటగాడిని రెచ్చగొట్టిన పాక్ బౌలర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
Inda Vs Paka Viral Video
Follow us

|

Updated on: Oct 20, 2024 | 12:26 PM

INDA vs PAKA: ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ, పాక్ బౌలర్ సుఫియాన్ ముఖీమ్ మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా స్టార్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ అవుట్ అయిన వెంటనే, పాక్ బౌలర్‌తో గొడవ పడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ శర్మ చాలా దూకుడుగా కనిపించాడు. ఆపై 7వ ఓవర్ తొలి బంతికే ముకీమ్ అతడిని పెవిలియన్‌కు పంపాడు. దీంతో అసలు వివాదం మొదలైంది.

అభిషేక్-సుఫియాన్ మధ్య గొడవ..

సుఫియాన్ ముఖీమ్ బంతికి అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత, ముకిమ్ సంబరాల్లో మునిగిపోయాడు. ఈక్రమంలో అభిషేక్‌ను పెవిలియన్‌కు తిరిగి వెళ్లమంటూ సంకేతాలు ఇచ్చాడు. ధీంతో అభిషేక్ శర్మకు కోపం వచ్చింది. ఇంతలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు జోక్యం చేసుకున్నారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ్యాచ్ గురించి మాట్లాడితే, అభిషేక్ ఇండియా ఏ తరపున ఓపెనర్ చేసి 35 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 22 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.

176 పరుగులకే పాక్ ఆలౌట్..

ముంబై ఇండియన్స్‌కు చెందిన తిలక్ వర్మ, అన్షుల్ కాంబోజ్‌లు ఇండియా ఎ జట్టు తరపున హీరోలుగా నిలిచారు. కాంబోజ్ 3 వికెట్లు తీయగా, తిలక్ 44 పరుగులతో నిలిచాడు. అనంతరం ఛేజింగ్‌లో పాక్ జట్టు తరపున 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ జట్టును గెలిపిస్తాడని అనిపించింది. కానీ, కాంబోజ్ అతనిని అవుట్ చేయడం ద్వారా భారతదేశానికి అతిపెద్ద విజయాన్ని అందించాడు. ఆ తర్వాత, మరే ఇతర ఆటగాడు క్రీజులో నిలవలేకపోయాడు. చివరికి భారత జట్టు 7 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. గ్రూప్ Bలో పాకిస్థాన్ A జట్టును ఓడించిన భారత జట్టు.. ఇప్పుడు UAEతో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..