Salman Khan: బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.2 కోట్లతో మరో బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ..
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ మరో బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ఆయన సెక్యూరిటీని ఇప్పటికే పెంచారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణహానీ ఉండడడంతో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రూ. 2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును సల్మాన్ కొనుగోలు చేశారు. సల్మాన్ సన్నిహితుడు , ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ దారుణంగా కాల్చి చంపిన తరువాత ఆయనకు సెక్యూరిటీని పెంచారు. . రెండు రోజుల క్రితం సల్మాన్‌ని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో సల్మాన్‌లో ప్రాణభయం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొన్నారు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తాజాగా బెదిరింపు మెసేజ్ రావడంతో సల్మాన్ అప్రమత్తమయ్యాడు.
సుమారు రూ.2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్ నుంచి ఆయన దిగుమతి చేసుకుంటున్నారు. . త్వరలోనే ఇది సల్మాన్ గ్యారేజ్‌లో చేరనుంది. ఆయన ఎంపిక చేసుకున్న ఆ మోడల్ కారు మన దేశంలో దొరకదని సమాచారం. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సల్మాన్ దగ్గరుంది. కానీ లేటెస్ట్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ కొత్త కారును కొనుగోలు చేశాడని సమాచారం. కొత్త కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్‌ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరోవైపు బాబా సిద్దిఖీ బాడీగార్డ్‌ను ముంబై పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.