AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎందుకండీ కోతి గారూ.. పాముతో పరాచకాలు.. కట్ చేస్తే.. ఇది సీన్

కోతులు తమ తింగరి చేష్టలతో ప్రమాదాల్లో పడుతూ ఉంటాయి. తాజాగా, పాము, కోతి వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాము కోతికి ఊహించని ఝలక్ ఇచ్చింది. ఆ వీడియో ఏంటో చూసేద్దాం పదండి....

Viral Video: ఎందుకండీ కోతి గారూ.. పాముతో పరాచకాలు.. కట్ చేస్తే.. ఇది సీన్
Monkey Vs Snake
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2024 | 11:59 AM

Share

కోతి చేష్టలు గురించి తెలిసిందే. తెలసీ తెలియక చేసే తింగరి పనులు వల్ల అవి.. ప్రమాదాల్లో పడుతూ ఉంటాయి. ఇళ్లలోకి వచ్చి ఆహార పదార్థాలు ఎత్తుకుపోయే కోతుల్ని మీరు చూసి ఉంటారు.. సర్కస్‌లో ఫీట్స్ చేసే వానరాలపై మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఇక ఆలయాల్లో భక్తుల నుంచి ప్రసాదాలు లాక్కెళ్లిపోయే కోతుల్ని కూడా మీరు చూసి ఉంటారు. ఆయా వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ కోతి.. పాముతో మధ్య వార్‌కి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోను గమనిస్తే..  కొబ్బరి చెట్టు ఎక్కిన ఓ కోతికి చెట్టు తొర్రలో ఓ స్నేక్ కనిపిస్తుంది. పామును చూడగానే కోతి.. దడవకుండా… తొర్రలోకి దూరి మరీ ఆ పామును పట్టుకునే ప్రయత్నం చేసింది. ముట్టుకోగానే పాము బుసలు కొడుతూ.. వానరంపైకి ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో కోతి తలపై కట్టిగా కరిచి పట్టుకుంది. దీంతో బిత్తరపోయిన కోతి.. విడిపించుకోవడానికి ఆపసోపాలు పడింది. లాగేందుకు విశ్వప్రయత్నం చేసి… పాము కోతిని వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. నొప్పితో విలవిల్లాడిన కోతి.. చివరకు ప్రాణం మీదకు రావడంతో.. తన శక్తిని అంతా పోగేసి పామును గట్టిగా పక్కకు లాగేస్తుంది. తర్వాత పాము అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అయితే అప్పటికే పాము చేసిన పనికి రగిలిపోతున్న కోతి.. పారిపోతున్న పామును పట్టుకుని.. మళ్లీ కొరికేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి