Taj Mahal: తాజ్‌మహల్ వద్ద పర్యాటకులపై దాడులు..! ఎవరో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..
ప్రపంచంలోని ఏడో వింత సమీపంలో ఈ తరహా ఏర్పాట్లను చూసి ఇక్కడికి వచ్చేవారు వాపోతున్నారు. తాజ్‌మహల్ వద్ద పర్యాటక శాఖ నిర్వహణ తీరుపై దేశ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రపంచ పర్యాటకులలో భారతదేశానికి ఎలాంటి ఇమేజ్ వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
ఆగ్రాలోని తాజ్ మహల్ దాని అందంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం తాజ్‌మహల్. ఆధునిక ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్‌కు నిర్మించిన తెల్లని పాలరాతి సమాధి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించే వారసత్వ ప్రదేశం. తాజ్ మహల్ అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు తరలివస్తుంటారు. కానీ, ఇప్పుడు తాజ్‌మహల్ దగ్గరకు వెళ్లేవారు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే వారిపై దాడులు జరుగుతున్నాయి. అయితే, ఇక్కడకు వచ్చే పర్యాటకులపై దాడులు చేస్తుంది ఏ ఉగ్రవాదులు, దారీ దోపిడీ దొంగలు కాదు..! మరేవరు..?
గత కొంతకాలంగా తాజ్‌మహల్ సందర్శన కోసం వచ్చే పర్యాటకులను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజ్‌మహల్ పరిసరాల్లో విచ్చల విడిగా సంచరిస్తున్న వీధి కుక్కలు స్థానికులతో పాటు, పర్యాటకులకు ఇబ్బందిగా మారింది. ప్రతిరోజూ ఇక్కడకు వచ్చేవారు కుక్కల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ వీధికుక్కలను నివారించాలని నగర కార్పొరేషన్ కూడా పేర్కొంది. కానీ, పనులు మాత్రం రికార్డుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 15న తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఒక విదేశీ మహిళా పర్యాటకురాలిని వీధికుక్క వెంబడించింది. విదేశీ మహిళ పర్యాటకురాలిపై హఠాత్తుగా అక్కడున్న కుక్క విరుచుకుపడింది. ఆమెను కరిచేందుకు పైకి ఎగిరింది. అయితే అక్కడే ఉన్న గైడ్ ఎలాగోలా ఆమెను కుక్కకాటు నుంచి కాపాడాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు దాన్ని వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.
ఓ వైపు తాజ్‌మహల్ వద్ద వీధికుక్కలు, కోతులను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోంది. మరోవైపు ఇలాంటి ఘటనలతో పర్యాటకుల్లో భయం నెలకొంది. విదేశీ పర్యాటకుల ముందు వీధికుక్కల బెడదతో దేశ ప్రతిష్ట మసకబారింది. తాజ్ మహల్ లోపల చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. తాజ్‌మహల్‌ను సందర్శించే అనేక మంది ప్రయాణికులను ఈ కుక్కలు వేధిస్తున్నాయి. కొన్ని కుక్కలు పర్యాటకులకు చాలా దగ్గరగా వస్తుంటాయి. అవి ఆహారం కోసం వారి వెంటపడుతున్నాయి. తరచూ పర్యాటకులపై దాడి చేసి కరిచిన ఘటనలు కూడా అనేకం జరిగాయి. ప్రపంచంలోని ఏడో వింత సమీపంలో ఈ తరహా ఏర్పాట్లను చూసి ఇక్కడికి వచ్చేవారు వాపోతున్నారు. తాజ్‌మహల్ వద్ద పర్యాటక శాఖ నిర్వహణ తీరుపై దేశ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రపంచ పర్యాటకులలో భారతదేశానికి ఎలాంటి ఇమేజ్ వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..