సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పేలుడు.. ముమ్మర దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు..
ఈ ఘటన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని మంటలు అదుపు చేసింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో విద్యార్థులు ఎవరూ స్కూల్‌కి రాలేదు. లేకుంటే ప్రాణ నష్టం జరిగేదని చెబుతున్నారు.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల పేలుడు సంభవించింది. ఆదివారం (అక్టోబర్ 20) ఉదయం 7:50 గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్ధం వినిపించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాఠశాల గోడ సమీపంలో పేలుడు సంభవించింది. బాంబు పేలుడు జరిగిన వెంటనే భారీ పొగలు కూడా కనిపించాయి. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని మంటలు అదుపు చేసింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో విద్యార్థులు ఎవరూ స్కూల్‌కి రాలేదు. లేకుంటే ప్రాణ నష్టం జరిగేదని చెబుతున్నారు.
పేలుడు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది. పేలుడు కారణంగా సమీపంలో పార్క్ చేసిన వాహనాలు, ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి. సిఆర్‌పిఎఫ్ పాఠశాలకు సమీపంలో చాలా దుకాణాలు ఉన్నాయని, అందువల్ల సిలిండర్ పేలుడు ఫలితంగా ఈ పేలుడు సంభవించే అవకాశం ఉందని చెప్పారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
Delhi A blast has been reported outside CRPF school in the Prashant Vihar area of Rohini district. The fire department was informed about the incident at around 7:50 am, after which two fire brigades were immediately dispatched pic.twitter.com/jKw0qIfFgY
— Vinay Tiwari (@vinaytiwari9697) October 20, 2024
సంఘటనా స్థలానికి క్రైమ్ టీమ్, ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లను రప్పించారు. క్రైం సీన్‌ను సీజ్ చేశారు. అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలంలోనే ఉంది. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..