Online Marriage: పాక్ అమ్మాయితో ప్రేమలోపడ్డ భారత్ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ హిందుస్థానీ యువకుడు సచిన్ మీనాతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే.. సీమా పాకిస్థాన్ నుంచి పారిపోయి ఇండియాలోని సచిన్ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ కూడా సీమ హైదర్ గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు హిందుస్తానీ యువకుడిపై ప్రేమతో మరో పాకిస్థానీ అమ్మాయి ప్రేమ కథ తెరమీదకు వచ్చింది.

Online Marriage: పాక్ అమ్మాయితో ప్రేమలోపడ్డ భారత్ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి
Online Marriage
Follow us

|

Updated on: Oct 20, 2024 | 11:06 AM

దేశంలో, ప్రపంచంలో మీరు ఎన్నో విచిత్రమైన, వింత వివాహాలను చూసి ఉంటారు. కానీ భారతదేశంలో జరిగిన ఈ ప్రత్యేకమైన వివాహం గురించి తెలిస్తే మాత్రం ఫిదా అవుతారు..అవును, భారతదేశం, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖలు ఉండొచ్చు. శత్రుత్వం గోడలు నిర్మించబడి ఉండవచ్చు.. కానీ, హృదయాల మధ్య సంబంధం నిరంతరం హద్దులు దాటుతోంది. కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ హిందుస్థానీ యువకుడు సచిన్ మీనాతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే.. సీమా పాకిస్థాన్ నుంచి పారిపోయి ఇండియాలోని సచిన్ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ కూడా సీమ హైదర్ గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు హిందుస్తానీ యువకుడిపై ప్రేమతో మరో పాకిస్థానీ అమ్మాయి ప్రేమ కథ తెరమీదకు వచ్చింది. సీమా హైదర్ లాగానే, పాకిస్థాన్‌కు చెందిన అందాలిప్ జహ్రా కూడా యూపీలోని జౌన్‌పూర్ నివాసి మహ్మద్ అబ్బాస్ హైదర్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్నారు.

పాక్ అమ్మాయికి, భారత్ అబ్బాయికి ఆన్‌లైన్‌లో ఘనంగా వివాహం జరిగింది. యూపీలోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన BJP నేత, కౌన్సిలర్‌ అయిన తహసీన్ షాహిద్ తన కొడుకు మహ్మద్ అబ్బాస్ హైదర్‌కు, పాక్‌లోని లాహోర్‌కు చెందిన యువతి అందాలిప్ జహ్రాతో శుక్రవారం పెళ్లి జరిపించారు. ఇరు కుటుంబ సభ్యులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. దానికి తోడు వధువు తల్లి యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయులో చేరడంతో ఈ పెళ్లి వేడుకను ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం రాత్రి తహసీన్ షాహిద్ పెళ్లి ఊరేగింపుతో ఇమాంబర కల్లు మర్హూమ్‌కు చేరుకున్నాడు. పెద్ద టీవీ స్క్రీన్‌పై అందరి ముందు నిఖాను ఆన్‌లైన్‌లో ప్రదర్శించారు. ఇరు దేశాల మౌలానాల చేతుల మీదుగా వివాహం జరిపించారు. లాహోర్‌లోని వధువు చుట్టూరా చాలా మంది బంధువులు కూర్చుని ఉండటం కూడా కనిపించింది. ఇప్పుడు, తన వధువును భారతదేశంలోని ఆమె అత్తమామల ఇంటికి తీసుకురావడానికి వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. తన వధువు భారత్‌కు వచ్చి ఇరు దేశాల మధ్య స్నేహం చిగురించేలా వీసా మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల మధ్య దూరం తొలగిపోయి సంబంధాలు బలోపేతం కావాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి