Video: ఎవర్రా సామీ.. చిరుత కంటే వేగం.. డేగ కంటే పవర్‌ఫుల్ చూపు.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌‌..

India A vs Pakistan A: వర్ధమాన జట్ల మధ్య ఆసియా కప్ టోర్నీలో భారత్ ఎ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఎ జట్టును 7 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా 2 పాయింట్లు సాధించింది. దీంతో ఈ టోర్నీని విజయంతో మొదలుపెట్టింది.

Video: ఎవర్రా సామీ.. చిరుత కంటే వేగం.. డేగ కంటే పవర్‌ఫుల్ చూపు.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌‌..
Ramandeep Singh Stunning One Handed Catch
Follow us

|

Updated on: Oct 20, 2024 | 11:56 AM

India A vs Pakistan A: ఓమన్‌లో జరుగుతున్న ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 టోర్నీ 4వ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రమణదీప్ సింగ్ అద్భుత క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భారత్ ఎ, పాకిస్థాన్ ఎ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ తిలక్ వర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టుకు అభిషేక్ శర్మ (35), ప్రభ్‌సిమ్రన్ (36) శుభారంభం అందించారు. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ 44 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఎ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఎ జట్టుకు శుభారంభం లభించలేదు. అయితే, యాసిర్ ఖాన్ క్రీజులో నిలదొక్కుకుని భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.

కాగా, నిశాంత్ సింధు వేసిన 9వ ఓవర్ తొలి బంతికి యాసిర్ ఖాన్ డీప్ మిడ్ వికెట్‌ మీదుగా భారీ షాట్ కోసం ట్రై చేశాడు. బంతి బౌండరీ లైన్ దాటబోతుండగా.. మెరుపు వేగంతో వచ్చిన రమణదీప్ సింగ్ అద్భుతంగా డైవింగ్ చేస్తూ ఒంటిచేత్తో బంతిని క్యాచ్ చేశాడు.

రమణదీప్ మెరుపు ఫీల్డింగ్ చూసి ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ అద్భుతమైన క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.

రమణదీప్ సింగ్ క్యాచ్ వీడియో:

ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 184 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఏ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ ఎ జట్టు 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..