Pro Kabaddi: రెండో మ్యాచ్‌లోనే తెలుగు టైటాన్స్‌కు బిగ్ షాక్.. ఖాతా తెరిచిన తమిళ్ తలైవాస్, పుణెరి పల్టాన్

Pro Kabaddi League 2024 Points Table: ప్రొ కబడ్డీ

Pro Kabaddi: రెండో మ్యాచ్‌లోనే తెలుగు టైటాన్స్‌కు బిగ్ షాక్.. ఖాతా తెరిచిన తమిళ్ తలైవాస్, పుణెరి పల్టాన్
Pro Kabaddi League 2024
Follow us

|

Updated on: Oct 20, 2024 | 10:21 AM

Pro Kabaddi League 2024 Points Table: ప్రొ కబడ్డీ లీగ్ 2024 రెండో రోజున మొత్తం రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్‌ ఓడిపోగా.. పుణెరి పల్టన్‌పై హర్యానా స్టీలర్స్‌ ఘోరంగా ఓడిపోయింది. ఈ విజయం తర్వాత, తలైవాస్, పుణెరి పల్టన్‌లు పాయింట్ల పట్టికలో తమ ఖాతాలను తెరవగా, తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన తెలుగు టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 10 పాయింట్ల తేడాతో ఓడిపోవడంతో ఒక్క పాయింట్ కూడా తీసుకోలేకపోయింది.

ప్రో కబడ్డీ లీగ్ 2024లో తమిళ్ తలైవాస్, పుణెరి పల్టన్ విజయాలతో ఆరంభం..

తమిళ్ తలైవాస్, పుణెరి పల్టాన్‌లు ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను శనివారం ఆడి అద్భుత విజయాన్ని సాధించాయి. తమిళ్ తలైవాస్ 44-29 తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. కాగా, పుణెరి పల్టన్ 35-25 తేడాతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరపున ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు సచిన్ తన్వర్ సూపర్-10, నరేంద్ర కండోలా కూడా సూపర్-10 సాధించాడు. కాగా, రెండో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌కు చెందిన గౌరవ్ ఖత్రీ డిఫెన్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి 7 పాయింట్లు సాధించాడు. మహ్మద్రెజా షాడ్లు 4 పాయింట్లు మాత్రమే తీయగలిగాడు.

ప్రో కబడ్డీ లీగ్ 2024 పాయింట్ల పట్టిక..

1. తమిళ్ తలైవాస్ – ఒక మ్యాచ్‌లో 5 పాయింట్లు

2. పుణేరి పల్టన్ – ఒక మ్యాచ్‌లో 5 పాయింట్లు

3. దబాంగ్ ఢిల్లీ – ఒక మ్యాచ్‌లో 5 పాయింట్లు

4. తెలుగు టైటాన్స్ – రెండు మ్యాచ్‌ల్లో 5 పాయింట్లు

5. బెంగాల్ వారియర్స్

6. గుజరాత్ జెయింట్స్

7. జైపూర్ పింక్ పాంథర్స్

8. పట్నా పైరేట్స్

9. యూపీ వారియర్

10. బెంగళూరు బుల్స్ – ఒక మ్యాచ్‌లో సున్నా పాయింట్లు

11.U -ముంబా – ఒక మ్యాచ్‌లో సున్నా పాయింట్లు

12. హర్యానా స్టీలర్స్ – ఒక మ్యాచ్‌లో సున్నా పాయింట్లు

ప్రో కబడ్డీ లీగ్ 2024లో టాప్ 5 రైడర్లు..

1. పవన్ సెహ్రావత్ (23 పాయింట్లు)

2. సచిన్ తన్వర్ (10 పాయింట్లు)

3. విజయ్ మాలిక్ (10 పాయింట్లు)

4. అషు మాలిక్ (10 పాయింట్లు)

5. అజిత్ చౌహాన్ (10 పాయింట్లు)

ప్రో కబడ్డీ లీగ్ 2024 టాప్ 5 డిఫెండర్లు..

1. గౌరవ్ ఖత్రి (7 పాయింట్లు)

2. కృష్ణ ధూల్ (6 పాయింట్లు)

3. సురీందర్ సింగ్ (5 పాయింట్లు)

4. సాగర్ సెట్పాల్ (5 పాయింట్లు)

5. సాహిల్ గులియా (5 పాయింట్లు).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..