Video: W,W,W.. రోహిత్, కోహ్లీ నమ్మలే.. సూర్య అండతో పాక్ జట్టుకు యముడయ్యాడు..
Kuldeep Yadav: ఆసియా కప్‌లో, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్‌పై ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థులను ఇబ్బందుల్లో పడగొట్టాడు. అయితే, ఈ సమయంలో అతను హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. కానీ, కుల్దీప్ తీసిన రెండు వికెట్లు పాకిస్తాన్ జట్టును ఇబ్బందుల్లో పడేశాయి.

Kuldeep Yadav: ఆసియా కప్ 2025లో దుబాయ్ మైదానంలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో సూర్యకుమార్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మరోసారి టీమిండియా బౌలర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మరోసారి తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. పాక్ బ్యాటర్ల పాలిట విలన్ లా మారిపోయాడు. రంగంలోకి దిగిన వెంటనే వికెట్ల వేట మొదలు పెట్టాడు. దీంతో పాక్ జట్టు అప్పటికే తేలిపోయింది. ఈ క్రమంలో చెలరేగిన చైనామన్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు.
ఆసియా కప్‌లో, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ పాకిస్థాన్‌పై ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థులను ఇబ్బందుల్లో పడగొట్టాడు. అయితే, ఈ సమయంలో అతను హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. కానీ, కుల్దీప్ తీసిన రెండు వికెట్లు పాకిస్తాన్ జట్టును ఇబ్బందుల్లో పడేశాయి.
కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు..
ఆ తర్వాత భారత జట్టు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వరుసగా రెండో బంతికి కుల్దీప్ ఒక వికెట్ తీసి పాకిస్తాన్‌కు ఆరో దెబ్బ రుచి చూపించాడు. కుల్దీప్ మొదట హసన్ నవాజ్‌ను అవుట్ చేసి, ఆ తర్వాతి బంతికే మొహమ్మద్ నవాజ్‌ను LBW ద్వారా పెవిలియన్‌కు పంపాడు.
🔥அதிரடி சரவெடி மாமே.. பேக் டு பேக் விக்கெட் தூக்கிய Kuldeep Yadav 🤩
📺காணுங்கள் #INDvPAK உங்கள் சோனி ஸ்போர்ட்ஸ் நேரலை டிவி சேனல் & சோனி லைவ்#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/jPrJOdXElD
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ నవాజ్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఈ విధంగా, పాకిస్తాన్ 64 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కుల్దీప్ హ్యాట్రిక్ కోసం భారత జట్టు, అభిమానులు ఎదురుచూశారు. కానీ అది జరగలేదు. ఈ ఓవల్‌లో కుల్దీప్ యాదవ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మూడు వికెట్లు తీసుకున్నాడు. అతను మొత్తం 4 ఓవర్లలో 18 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
యూఏఈపై హ్యాట్రిక్ సాధించిన కుల్దీప్ యాదవ్..
ఆసియా కప్‌లో టీం ఇండియా తొలి మ్యాచ్ UAEతో జరిగింది. ఈ మ్యాచ్‌లో, కుల్దీప్ యాదవ్ 9వ ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. UAEతో జరిగిన 9వ ఓవర్ మొదటి బంతికి రాహుల్ చోప్రా (3 పరుగులు), నాల్గవ బంతికి కెప్టెన్ మహ్మద్ వసీం, చివరి బంతికి హర్షిత్ కౌశిక్‌లను అవుట్ చేశాడు. ఆసియా కప్‌లో టీమిండియా తరపున కుల్దీప్ యాదవ్ అద్భుత లయతో బౌలింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








